PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-ganta-chandrababu230ed84a-7d9d-4e87-b3f0-f860ef1270c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-ganta-chandrababu230ed84a-7d9d-4e87-b3f0-f860ef1270c6-415x250-IndiaHerald.jpgగంటా స్టైల్ ఏమిటంటే ఒకసారి పోటీచేసిన నియోజకవర్గంలో రెండోసారి పోటీచేయరు. అందుకనే అనకాపల్లి, భీమిలి, చోడవరం, విశాఖ ఉత్తరం నియోజకవర్గాల్లో పోటీచేసింది. ఇపుడు విషయం ఏమిటంటే జిల్లాలో పోటీచేయటానికి గంటాకు నియోజకవర్గం లేదు. ఏ నియోజకర్గంలో పోటీచేయాలని అనుకున్నా అక్కడి ఎంఎల్ఏలు లేదా మాజీలు అంగీకరించటంలేదు. పైగా పొత్తులో జనసేన, బీజేపీలకు కొన్ని సీట్లు పోతున్నాయి. కాబట్టి గంటాకు నియోజకవర్గమే లేకుండాపోయింది. vizag ganta chandrababu{#}Lokesh;Hanu Raghavapudi;Anakapalle;Vijayanagaram;Vishakapatnam;Assembly;Minister;Lokesh Kanagaraj;Vizianagaram;CBN;Electionsఉత్తరాంధ్ర : ఓవరాక్షనే కొంపముంచిందా ?ఉత్తరాంధ్ర : ఓవరాక్షనే కొంపముంచిందా ?vizag ganta chandrababu{#}Lokesh;Hanu Raghavapudi;Anakapalle;Vijayanagaram;Vishakapatnam;Assembly;Minister;Lokesh Kanagaraj;Vizianagaram;CBN;ElectionsSat, 24 Feb 2024 07:00:00 GMT

అతిచేస్తే గతిచెడుతుందనే సామెత చాలా పాపులర్. ఇపుడీ సామెత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు సరిగ్గా సరిపోతుంది. ఎలాగంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి గంటాకు నియోజకవర్గమే లేదు. అందుకనే గంటాను విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయమని చంద్రబాబునాయుడు ఆదేశించారు. చీపురుపల్లిలో పోటీచేయటానికి గంటా ఏమాత్రం ఇష్టపడటంలేదు. ఎందుకంటే గంటాకన్నా ఏ రకంగా చూసుకున్న మంత్రి బొత్సా సత్యానారాయణ చాలా పవర్ ఫుల్. బొత్సా తో పోటీపడితే తాను ఓడిపోతారనే భయం గంటాలో పెరిగిపోతున్నట్లుంది.





కారణం చెప్పలేదు కాని చీపురుపల్లిలో పోటీచేయటం తనకు ఇష్టంలేదని గంటా స్వయంగా ప్రకటించారు. విశాఖ జిల్లాకు 150 కిలోమీటర్ల దూరంలోని వేరే జిల్లాలో తనను పోటీచేయాలని చంద్రబాబు చెప్పటం అన్యాయమని గంటా గోలపెడుతున్నారు. దీనికి స్వయంకృతమే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో చేసిన ఓవర్ యాక్షనే ఇపుడు గంటా మెడకు చుట్టుకున్నది. అదెలాగంటే గంటా ఇప్పటికి ఐదు ఎన్నికల్లో పోటీచేస్తే ఐదింటిలోను గెలిచారు. అనకాపల్లి ఎంపీగా పోటీచేయటంతో మొదలైన రాజకీయ జీవితం విశాఖ ఉత్తరంలో 2019 ఎన్నికల్లో గెలవటం వరకు సజావుగానే సాగింది.





గంటా స్టైల్ ఏమిటంటే ఒకసారి పోటీచేసిన నియోజకవర్గంలో రెండోసారి పోటీచేయరు. అందుకనే అనకాపల్లి, భీమిలి, చోడవరం, విశాఖ ఉత్తరం నియోజకవర్గాల్లో పోటీచేసింది. ఇపుడు విషయం ఏమిటంటే జిల్లాలో పోటీచేయటానికి గంటాకు నియోజకవర్గం లేదు. ఏ నియోజకర్గంలో పోటీచేయాలని అనుకున్నా అక్కడి ఎంఎల్ఏలు లేదా మాజీలు అంగీకరించటంలేదు. పైగా పొత్తులో జనసేన, బీజేపీలకు కొన్ని సీట్లు పోతున్నాయి. కాబట్టి గంటాకు నియోజకవర్గమే లేకుండాపోయింది.





మొదటినుండి ఏదో ఒక నియోజకవర్గంలోను ఉండుంటే ఇపుడీ అవస్త గంటాకు వచ్చుండేది కాదేమో. పైగా 2019 ఎన్నికల తర్వాత నాలుగేళ్ళు గంటా పార్టీలో ఎక్కడా కనబడలేదు. వైసీపీలో చేరేందుకు శతవిధాల ప్రయత్నించి కుదరక వేరే దారిలేక చివరకు టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి టికెట్ కోసం మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇక్కడే చంద్రబాబు, లోకేష్ కు బాగా మండిపోయింది. అందుకనే విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో పోటీచేయమని తిరిమింది. మరి గంటా చీపురుపల్లిలో పోటీచేస్తారా ? లేకపోతే ఎన్నికలనుండే తప్పుకుంటారా ? అదీకాకపోతే పార్టీమారిపోయి ఏదన్నా పార్టీలో చేరి తాను కోరుకున్న నియోజకర్గంలో పోటీచేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>