MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7e2bfd49-be0b-42ca-9bc1-7c8fdc08454b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7e2bfd49-be0b-42ca-9bc1-7c8fdc08454b-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి2898AD'. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.550 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. వైజయంతి మూవీస్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రభాస్ తో పాటు సౌత్, నార్త్ కి చెందిన చాలామంది స్టార్స్ సినిమాలో భాగమవుతున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో 'కల్కి 2898 AD'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. గత రెండున్నర tollywood{#}Amitabh Bachchan;Jr NTR;nag ashwin;vyjayanthi;vijay kumar naidu;Comedian;Prabhas;Hero;Indian;Chitram;bollywood;India;Cinemaప్రభాస్ సినిమాపై కమెడియన్ ఆసక్తికర వ్యాఖ్యలు!ప్రభాస్ సినిమాపై కమెడియన్ ఆసక్తికర వ్యాఖ్యలు!tollywood{#}Amitabh Bachchan;Jr NTR;nag ashwin;vyjayanthi;vijay kumar naidu;Comedian;Prabhas;Hero;Indian;Chitram;bollywood;India;CinemaSat, 24 Feb 2024 12:25:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి2898AD'. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.550 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. వైజయంతి మూవీస్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రభాస్ తో పాటు సౌత్, నార్త్ కి చెందిన చాలామంది స్టార్స్ సినిమాలో భాగమవుతున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో 'కల్కి 2898 AD'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. గత రెండున్నర సంవత్సరాలుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. ఇటీవల 'కల్కి' 9 భాగాలుగా రాబోతుందని రూమర్స్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ కమెడియన్ సైతం అది నిజమే అనే విధంగా కామెంట్స్ చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

ఈ నగరానికి ఏమైంది సినిమాతో కమెడియన్గా ఎంతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అభినవ్ గోమటం హీరోగా మారి 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' అనే సినిమాలో నటించాడు  ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినవ్ 'కల్కి' మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు  ముఖ్యంగా 'కల్కి' 9 భాగాలుగా రాబోతుందనే విషయాన్ని హైలెట్ చేస్తూ అభినవ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి." నేను కల్కి మూవీ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నా. రీసెంట్ గా ఈ సినిమా 9 భాగాలుగా రాబోతుందని విన్నాను. అది విన్న దగ్గర నుంచి సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది" అంటూ చెప్పుకొచ్చాడు.

'కల్కి2898AD' లో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా దిశా పటానీ కనిపించనుంది. ప్రస్తుతం యూరోప్‌లో ప్రభాస్, దిశాల మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరుగుతోందని సమాచారం. మే 9న మూవీ విడుదల తేదీని ఖరారు చేయడంతో పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా ప్రారంభించారు మేకర్స్. భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ నటులు.. ఇప్పటికే ఇందులో భాగమయ్యారు. వీరితో పాటు  రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నాచురల్ స్టార్ నాని, జూనియర్ ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్స్ క్యామియో రోల్స్ చేస్తున్నారు.

 


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>