PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ec9a10eb52-6b18-44df-8968-d40782066b11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ec9a10eb52-6b18-44df-8968-d40782066b11-415x250-IndiaHerald.jpgదేశమంతా ఎన్నికల మూడ్‌ వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. అయితే.. అధికారంలో ఉన్న పార్టీలు తమ అధికారం అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే.. ఎన్నికల నిబంధనల్లో భాగంగా 3 ఏళ్లు సర్వీసు దాటిన అధికారుల జిల్లాల బదిలీ ఒకే పార్లమెంటు నియోజకవర్గంలో ఉండకూడదని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా కేసులను తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికల సంఘం ec{#}Election Commission;central government;Parliament;Assemblyవాళ్లను బదిలీ చేయాల్సిందే.. ఈసీ అల్టిమేటమ్‌?వాళ్లను బదిలీ చేయాల్సిందే.. ఈసీ అల్టిమేటమ్‌?ec{#}Election Commission;central government;Parliament;AssemblySat, 24 Feb 2024 23:01:52 GMTదేశమంతా ఎన్నికల మూడ్‌ వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. అయితే.. అధికారంలో ఉన్న పార్టీలు తమ అధికారం అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే.. ఎన్నికల నిబంధనల్లో భాగంగా 3 ఏళ్లు సర్వీసు దాటిన అధికారుల జిల్లాల బదిలీ ఒకే పార్లమెంటు నియోజకవర్గంలో ఉండకూడదని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


ఈ తరహా కేసులను తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మార్గదర్శకాల ప్రకారం అధికారుల పోస్టింగ్ రెండు వేర్వేరు జిల్లాలకు జరిగినా ఒకే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా  ఆ తరహా బదిలీలు చేస్తే ఈసీ తగిన చర్యలు చేపడుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. సదరు అధికారులు ఎన్నికల విధులకు ఆటంకం కలిగించకుండా ఈసీఐ పటిష్టమైన చర్యలు చేపడుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  
అధికారుల బదిలీలు రెండు వేర్వేరు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉండేలా చూడాలని రాష్ట్రాలకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనల మేరకు బదిలీ చేసినట్టు మభ్యపెట్టకుండా యథాతథంగా  అమలు చేయాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.

 
ఇప్పటి వరకూ చేసిన అన్ని బదిలీలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం ఎన్నికలతో సంబంధం ఉన్న లేక పర్యవేక్షణ స్థాయిలో ఉన్న అధికారులు ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి అయితే బదిలీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్నికల్లో సమాన అవకాశాలు లేకుండా చేసే వారి పట్ల ఏమాత్రం ఉపేక్షించేది లేదని  తేల్చి చెప్పిన ఎన్నికల సంఘం.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన 5 రాష్ట్రాల్లోనూ సీనియర్ స్థాయిలోని అధికారులపైనా బదిలీ వేటు వేసినట్టు స్పష్టం చేస్తూ నోట్ విడుదల చేసింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>