MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh--trisha75003206-b79d-4363-a361-51a9b7843c5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh--trisha75003206-b79d-4363-a361-51a9b7843c5d-415x250-IndiaHerald.jpgతెలుగు సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ ఇంకా తమిళ స్టార్ హీరోయిన్‌ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎంత మంచి హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కాంబినేషన్ లో ఇప్పటిదాకా మూడు సినిమాలు వచ్చాయి.మళ్ళీ ఇప్పుడు ఈ కాంబినేషన్ నాలుగోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. వీరిద్దరూ కలిసి గతంలో 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' (2007), 'నమో వెంకటేశ'(2010), 'బాడీగార్డ్‌'(2012) వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.ఇక ఈ హిట్‌ జోడీ ఇప్పుడు నాలుగోసారి కలిసి నటించేందుకు సVenkatesh - Trisha{#}Success;Trisha Krishnan;Hero;Director;Tamil;Cinema;Newsవెంకీ, త్రిష 4వ సినిమా స్టోరీ అదేనా?వెంకీ, త్రిష 4వ సినిమా స్టోరీ అదేనా?Venkatesh - Trisha{#}Success;Trisha Krishnan;Hero;Director;Tamil;Cinema;NewsSat, 24 Feb 2024 14:07:44 GMTవెంకీ, త్రిష 4 వ సినిమా స్టోరీ అదేనా ?

తెలుగు సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ ఇంకా తమిళ సీనియర్  స్టార్ హీరోయిన్‌ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎంత మంచి హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కాంబినేషన్ లో ఇప్పటిదాకా మూడు సినిమాలు వచ్చాయి.మళ్ళీ ఇప్పుడు ఈ కాంబినేషన్ నాలుగోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. వీరిద్దరూ కలిసి గతంలో 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' (2007), 'నమో వెంకటేశ'(2010), 'బాడీగార్డ్‌'(2012) వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.ఇక ఈ హిట్‌ జోడీ ఇప్పుడు నాలుగోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్‌ హీరోగా సక్సెస్ ఫుల్ స్టార్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం తెలుస్తుంది. 


వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌లతో 'ఎఫ్‌ 2', 'ఎఫ్‌ 3' వంటి సినిమాలు తీసి, హిట్‌ అందుకున్నారు యంగ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి.ఇంకా ఈ ఫ్రాంచైజీలో 'ఎఫ్‌ 4' సినిమా ఉంటుందని 'ఎఫ్‌ 3' క్లైమాక్స్‌లో హింట్‌ ఇచ్చింది చిత్రయూనిట్‌. 'ఎఫ్‌ 2, ఎఫ్‌ 3' సినిమాలు నిర్మించిన 'దిల్‌' రాజే తాజాగా వెంకీ-అనిల్‌ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా నిర్మించనున్నారట. ఈ మూవీ లో హీరోయిన్‌గా త్రిష ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. అంటే.. ఏకంగా ఒక పుష్కరకాలం తర్వాత వెంకటేశ్‌-త్రిష మరోసారి జోడీగా నటించనున్నారన్నమాట. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్ను ఈ మూవీ 2025 సంక్రాంతికి విడుదల కానున్నట్లు సమాచారం  తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్‌తో అనిల్‌ రావిపూడి తెరకెక్కించేది 'ఎఫ్‌ 4' సినిమానా? లేక మరొక చిత్రమా? అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక నాలుగోసారి ఈ హిట్ కాంబినేషన్ అభిమానులని మెప్పిస్తుందో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>