MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమెగా స్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవికి ఒకప్పుడు వరస ఫ్లాప్ లు వెంటాడిన విషయం ఈనాటి తరానికి తెలియకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు చిరునామాగా ఒకప్పుడు పేరు గాంచిన ‘హిట్లర్’ మూవీతో చిరంజీవి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘జగదీక వీరుడు అతిలోక సుందరి’ మూవీ స్థాయికి మించి ఫ్యాంటసీ మూవీగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీ కథకు సంబంధిchirangeevi{#}Rekha;Bhimavaram;Chiranjeevi;Darsakudu;Heroine;News;Cinema;Director;India;Trisha Krishnanవిశ్వంభరలో ఒకనాటి హిట్లర్ !విశ్వంభరలో ఒకనాటి హిట్లర్ !chirangeevi{#}Rekha;Bhimavaram;Chiranjeevi;Darsakudu;Heroine;News;Cinema;Director;India;Trisha KrishnanSat, 24 Feb 2024 09:00:00 GMTమెగా స్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవికి ఒకప్పుడు వరస ఫ్లాప్ లు వెంటాడిన విషయం ఈనాటి తరానికి తెలియకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు చిరునామాగా ఒకప్పుడు పేరు గాంచిన ‘హిట్లర్’ మూవీతో చిరంజీవి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు.



ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘జగదీక వీరుడు అతిలోక సుందరి’ మూవీ స్థాయికి మించి ఫ్యాంటసీ మూవీగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీ కథకు సంబంధించి వస్తున్న లీకుల ప్రకారం ‘విశ్వంభర’ లో చిరంజీవి పాత్ర పేరు దొరబాబు అని అంటున్నారు.  



భీమవరం దగ్గరలోని ఒక గ్రామంలో కథ మొదలవుతుందని టాక్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన చిరంజీవికి ఈ మూవీలో 5 గురు చెల్లెళ్ళు ఉంటారట. ఈమూవీ కథ చాలమటుకు సిస్టర్ సెంటిమెంట్ తో నడవడంతో ఈమూవీని చూస్తున్న వారికి గతంలో చిరంజీవి నటించిన సిస్టర్ సెంటిమెంట్ మూవీ ‘హిట్లర్’ కధ రేఖా మాత్రంగా గుర్తుకు వస్తుంది అని అంటున్నారు.  పెద్దకుటుంబమే అయినప్పటికీ అయిదుగురు అక్కాచెల్లెళ్ల బాధ్యత చిరంజీవి పై ఉండటంతో వారి కోసం ఎలాంటి సాహసాన్ని అయినా చిరంజీవి చేస్తూ ఉంటాడట.



అయితే చెల్లెళ్లుగా అక్కలుగా నటించే నటీమణుల కోసం ఇప్పుడు అన్వేషణ కొనసాగుతున్నప్పటికీ ఈపాత్రలకు సరైన న్యాయం చేయగల నటీమణులు దర్శకుడు విశిష్ట కు అయందుబాటులోకి రావడం లేదు అంటున్నాయాఉ. ఈమూవీలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా త్రిష ఎంపిక అయినప్పటికీ ఈమూవీ కథ రీత్యా మరో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండటంతో వారి గురించి అన్వేషణ కొనసాగుతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి దర్శకుడు వశిష్ట భారీ ప్లాన్స్ ఇప్పటి నుంచే అమలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..      







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>