Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0be56133-f501-414b-a8be-f1c314f7ef31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0be56133-f501-414b-a8be-f1c314f7ef31-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే స్టార్లుగా ఎదుగుతారు. వాళ్లకు మాత్రమే చాలా లాంగ్ కెరియర్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు.కానీ హీరోలకు సైతం పోటీని ఇస్తూ దాదాపు 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన నటి జయలలిత…తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంది. అయితే జయలలిత కెరియర్లో ఒక మిస్టరీ అనేది అలాగే ఉండిపోయింది. అది ఏంటి అంటే శోభన్ బాబుకి జయలలిత కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరు క్లారిటీగా చెప్పలేకపోయారు.ఇప్పటివరకు వాళ్ల మీద socialstars lifestyle{#}jayalalitha;sobhan babu;prema;Ishtam;Yevaru;Manam;Love;Heroine;News;Tamil;Cinemaశోభన్ బాబు డైరీ లో వున్న ఆసక్తికర విషయాలు ఎన్నో..!!శోభన్ బాబు డైరీ లో వున్న ఆసక్తికర విషయాలు ఎన్నో..!!socialstars lifestyle{#}jayalalitha;sobhan babu;prema;Ishtam;Yevaru;Manam;Love;Heroine;News;Tamil;CinemaSat, 24 Feb 2024 21:16:37 GMTసినిమా ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే స్టార్లుగా ఎదుగుతారు. వాళ్లకు మాత్రమే చాలా లాంగ్ కెరియర్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు.కానీ హీరోలకు సైతం పోటీని ఇస్తూ దాదాపు 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన నటి జయలలిత…తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంది. అయితే జయలలిత కెరియర్లో ఒక మిస్టరీ అనేది అలాగే ఉండిపోయింది. అది ఏంటి అంటే శోభన్ బాబుకి జయలలిత కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరు క్లారిటీగా చెప్పలేకపోయారు.ఇప్పటివరకు వాళ్ల మీద ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అవి నిజమా, అబద్దమా అనే విషయాల్లో కూడా ఎవరికి సరైన క్లారిటీ లేదు. ఇక ఇదిలా ఉంటే జయలలిత తనతో చెప్పిన కొన్ని మాటలని శోభన్ బాబు డైరీలో రాసుకున్నాడు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పింది ఆయన ఏం రాసుకున్నారు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

శోభన్ బాబు, జయలలిత కాంబినేషన్ లో ‘డాక్టర్ బాబు’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే జయలలిత అమ్మ చనిపోయింది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ పెరిగిన జయలలిత కి అమ్మ తప్ప మరో తోడు లేదు. దాంతో తను ఒంటరి అయిపోయిన ఫీలింగ్ లో ఉండేది. ఇక ఆ సమయంలో షూటింగ్ స్పాట్ లో కూడా తను ఎప్పుడు చాలా డల్ గా ఉండేది. అది గమనించిన శోభన్ బాబు ఆమెతో పాటు చాలా క్లోజ్ గా మాట్లాడుతూ జోకులు వేస్తూ, ఆమెని నవ్వించే ప్రయత్నం చేసేవాడు. అలా తనని ఆ బాధ నుంచి బయటపడేసి తను సినిమాల మీద మళ్ళీ ఫోకస్ పెట్టేలా చేశాడు. అందువల్లే శోభన్ బాబు అంటే జయలలిత కి అమితమైన ఇష్టం ఉండేది. ఇక ఆ తర్వాత వాళ్ళు చాలా క్లోజ్ అయ్యారు. అయితే శోభన్ బాబు తన డైరీలో ఇలా రాసుకున్నాడు.“బరువైన నా మనసుని నీ మాటలతో, జోకులతో తేలిక చేశావు. ప్రపంచమంతా ఇప్పుడు నాకు చాలా విశాలంగా కనిపిస్తుంది. అందరితో మాట్లాడాలని అనిపిస్తుంది”. అంటూ జయలలిత తనతో చెప్పిన మాటలను శోభన్ బాబు డైరీలో రాసుకున్నాడు. ఇక ఇవే కాకుండా “నా తల్లి మరణించి కొన్ని రోజులే అవుతున్న, ఎన్నో సంవత్సరాలు అవుతున్నట్టు అనిపిస్తుంది. నా బంధువులు అందరూ నా డబ్బును మాత్రమే చూసి నాకు దగ్గరవ్వాలనుకున్నారు. కానీ మీరు మాత్రం నా భాదను అర్థం చేసుకొని నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశారు”.అని జయలలిత చెప్పిన మాటలను శోభన్ బాబు తన డైరీ లో రాసుకోవడం విశేషం… ఇక ఇది చూసిన కొందరు వీళ్ళ మధ్య అమితమైన ప్రేమ ఉంది అని చెప్తుంటే, మరికొందరు మాత్రం వీళ్లది తల్లి, కూతుళ్ళ బంధం అని చెప్తూ ఉంటారు. ఇక ప్రస్తుతానికి ఇద్దరు మన మధ్య లేరు కాబట్టి వీళ్ళ బంధం ఏంటో ఎవరికి తెలియని ఒక మిస్టరీ గా మిగిలిపోయింది…



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>