MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4b793bdd-9006-4643-a7e4-85f2d1a74b49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4b793bdd-9006-4643-a7e4-85f2d1a74b49-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RRR' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా అద్భుత నటన కనబరిచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ వైట్ గా పాపులర్ అయిన చరణ్ అదే పాపులారిటీ మెయింటైన్ చేసేలా తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. చరణ్ యాక్టింగ్ కి ఫిదా అయిన వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా చేరిపోయారు. తాజాగా రామ్ చరణ్ గురించి సూర్య చేసిన కామెంట్స్ tollywood{#}Alluri Sitarama Raju;Shiva;lord siva;Rajamouli;surya sivakumar;Hero;House;Pawan Kalyan;kushi;Kushi;Fidaa;Chitram;Ram Charan Teja;bollywood;media;India;Kollywood;Heroine;Audience;Cinemaఆ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యా..సూర్యఆ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యా..సూర్యtollywood{#}Alluri Sitarama Raju;Shiva;lord siva;Rajamouli;surya sivakumar;Hero;House;Pawan Kalyan;kushi;Kushi;Fidaa;Chitram;Ram Charan Teja;bollywood;media;India;Kollywood;Heroine;Audience;CinemaSat, 24 Feb 2024 12:15:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RRR' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా అద్భుత నటన కనబరిచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ వైట్ గా పాపులర్ అయిన చరణ్ అదే పాపులారిటీ మెయింటైన్ చేసేలా తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. చరణ్ యాక్టింగ్ కి ఫిదా అయిన వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా చేరిపోయారు. తాజాగా రామ్ చరణ్ గురించి సూర్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య రామ్ చరణ్ నటన పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు చరణ్ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఈ మేరకు సూర్య మాట్లాడుతూ.." రామ్ చరణ్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా 'రంగస్థలం' సినిమాలో చరణ్ యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా. ఒకవేళ నాకు చరణ్ తో వర్క్ చేస్తే ఛాన్స్ వస్తే తన సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి అయినా నేను రెడీగా ఉన్నాను" అంటూ తెలిపాడు. దీంతో చరణ్ పై సూర్య చేసిన కామెంట్స్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

కోలీవుడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా' డబ్బింగ్ మొదలయ్యింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణసంస్థలు యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ జనవరిలో పూర్తయింది. తాజాగా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు చిత్ర ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. ఈ చిత్రంలో సూర్య ఐదు విభిన్న పాత్రల్లో అలరించబోతున్నారు. ఎప్పుడూ విభిన్నమైన పాత్రలనే ఎంచుకునే సూర్య ఈసారి ఏకంగా ఒకే చిత్రంలో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతుండటంతో ఆడియన్స్ సైతం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ వరల్డ్ చిత్రంగా ఈ మూవీ పది భాషల్లో విడుదల కానుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>