Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled5463874-4868-4b8d-9693-99d1c161ef04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled5463874-4868-4b8d-9693-99d1c161ef04-415x250-IndiaHerald.jpgవేల కోట్ల ఆస్తి, రాయల్‌ లైఫ్‌ అనుభవించే జేడీ చక్రవర్తి ఎందుకు సడెన్‌గా రోడ్డున పడ్డారు. చిన్న ఇరుకు ఇంట్లో ఉంటూ, నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..జేడీ చక్రవర్తి ఒకప్పుడు స్టార్‌ హీరోలకు దీటుగా సినిమాలు చేసి మెప్పించిన హీరో. డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలతో మెప్పించాడు. హీరోగానే కాదు నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి మెప్పించాడు. పాత్ర కంటే కంటెంట్‌కి ప్రయారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవల దయా అనే వెబ్‌ సిరీస్‌socialstars lifestyle{#}satya;V;chakravarthy;Husband;Ram Gopal Varma;Father;Mumbai;king;Governmentసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జేడీ చక్రవర్తి ఆసక్తికర ఇంటర్వ్యూ..!!!సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జేడీ చక్రవర్తి ఆసక్తికర ఇంటర్వ్యూ..!!!socialstars lifestyle{#}satya;V;chakravarthy;Husband;Ram Gopal Varma;Father;Mumbai;king;GovernmentSat, 24 Feb 2024 21:13:16 GMTవేల కోట్ల ఆస్తి, రాయల్‌ లైఫ్‌ అనుభవించే జేడీ చక్రవర్తి ఎందుకు సడెన్‌గా రోడ్డున పడ్డారు. చిన్న ఇరుకు ఇంట్లో ఉంటూ, నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..జేడీ చక్రవర్తి ఒకప్పుడు స్టార్‌ హీరోలకు దీటుగా సినిమాలు చేసి మెప్పించిన హీరో. డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలతో మెప్పించాడు. హీరోగానే కాదు నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి మెప్పించాడు. పాత్ర కంటే కంటెంట్‌కి ప్రయారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవల దయా అనే వెబ్‌ సిరీస్‌తో మళ్లీ మెయిన్‌ స్ట్రీమ్‌లోకి వచ్చాడు. ఇకపై రెగ్యూలర్‌గా సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు.ఇదిలా ఉంటే ఆ సందర్భంగా జేడీ చక్రవర్తి తన గతం గురించి పలు షాకింగ్‌ విషయాలను పంచుకున్నారు. రాయల్‌ లైఫ్‌ని అనుభవించిన జేడీ చక్రవర్తి రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురయ్యిందని తెలిపారు. తాజాగా జేడీ చక్రవర్తి ఇంటర్వ్యూ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో ఆసక్తికర విషయాలను, ఇప్పటి వరకు బయటకు రాని రహస్యాలను జేడీ చక్రవర్తి పంచుకున్నారు. ఇందులో తన జీవితంలోని రెండేళ్ల బ్యాడ్‌ ఫేజ్‌ని బయటపెట్టాడు.
జేడీ చక్రవర్తికి హైదరాబాద్‌లో వందల కోట్లు విలువల చేసే వందల ఎకరాలు ఉండేదట. రాజమండ్రిలోనూ వేల ఎకరాల ల్యాండ్‌ ఉందట. ఈ విషయాన్ని యాంకర్‌ ప్రశ్నించారు. `మీది చిన్నప్పట్నుంచి గోల్డెన్‌ స్ఫూన్‌ అని, డైమండ్‌ స్ఫూన్‌ అని కూడా విన్నాను. గోల్డోండ ఎదురుగా వందల ఎకరాలు జేడీ చక్రవర్తి వాళ్ల ఫాదర్‌ వి అని, అలాగే రాజమండ్రిలోనూ వేల ఎకరాలు ఉండేవని విన్నాను. కానీ మీ ఫాదర్‌ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు, దాన్ని చూసుకోవడం బర్డెన్‌ అయ్యిందా? అని అడగ్గా..
జేడీ చక్రవర్తి.. నవ్వుతూ ఎక్కడ ఉందో చెబితే తెచ్చుకుంటాను, కొంచెం అడ్రస్‌ ఇవ్వూ అంటూ రియాక్ట్ అయ్యాడు. అయితే అవి లేవు అని మాత్రం ఆయన్నుంచి సమాధానం రాలేదు.ఈ క్రమంలో అసలు విసయాలను బయటపెట్టాడు జేడీ. తన 13ఏళ్ల వయసులో నాన్న చనిపోయాడు. దీంతో అమ్మే అంతా చూసుకుందని తెలిపారు. రాత్రి తనతో పడుకున్న నాన్న మార్నింగ్‌ లేచే సరికి లేకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనని తెలిపారు. ఆ వయసులో ఈ బరువు, బాధ్యతలు పెద్దగా తెలియవని, పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టు చెప్పాడు.

 
తన మదర్‌ చాలా బాధగా, భారంగా ఫీలయ్యారట. తల్లి పేరు కోవేల శాంత. ఆమె ఇండియాలోనే హైలీ ఎడ్యూకేటెడ్‌ ఉమెన్‌ అట. ఆమె ఎన్నో ఎమ్‌ఏలు, ఎన్నో డాక్టరేట్లు, పీహెచ్‌డీలు,మ్యూజిక్‌లో ప్రొఫేసర్‌. మ్యూజిక్‌ కాలేజీలో ప్రొఫేసర్‌గా సరదాగా జాబ్‌ చేస్తుండేదట. భర్త చనిపోయినప్పుడు భర్త ఆస్తి భార్యకి రావాలంటే లీగల్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ కావాలట. ఆ సమయలో అమ్మ అది తీసుకుందని తెలిపారు. ఆయనకు ఫస్ట్ వైఫ్‌, లాస్ట్ వైఫ్‌ ఆమెనే అని ప్రభుత్వం సర్టిఫికేట్‌ ఇస్తే నాన్నగారి ప్రాపర్టీస్‌ మాకు వస్తాయి.అయితే ఆ సర్టిఫికేట్‌ కోసం దాదాపు రెండేళ్లు పట్టిందట. అప్పట్లో దాదాపు ఒక ఎకరం స్థలంలో ఇళ్లు ఉండేదట. పనివాళ్లు ఉండేవారట. లగ్జరీ హోమ్‌ అని, రాయల్‌ లైఫ్‌ ఉండేదని, కానీ నాన్న చనిపోయాక అవన్నీ పోయినట్టు చెప్పాడు. లీగల్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ వచ్చేంత వరకు అన్నీ వదులుకుని చిక్కడపల్లిలో ఒక చిన్న ఇంటిలో రెంట్‌కి ఉండాల్సి వచ్చిందట. దాదాపు రెండేళ్లు స్ట్రగుల్ అయ్యామని, అది మాకు గొప్ప లెసన్‌ అని తెలిపారు.నిన్నటి వరకు పెద్ద బంగ్లా, ఇంట్లో పనివాళ్లు, సినిమాల్లో చూపించినట్టు పెద్ద హంగామా ఉండేది. కానీ కట్‌ చేస్తే నెక్ట్స్ డే నేనే రాజు నేనే మంత్రిలా ఒంటరి అయిపోయినట్టు తెలిపారు. అన్ని పనులు మేమే చేసుకోవాల్సి వచ్చేది. అంతకు ముందు కార్లల్లో తిరిగిన మేం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది అని పేర్కొన్నాడు జేడీ చక్రవర్తి. ఓ రకంగా రాయల్‌ లైఫ్‌ నుంచి రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురయ్యిందని, అవన్నీ అమ్మనే ఫేస్‌ చేసిందని వెల్లడించారు జేడీ చక్రవర్తి. రెండేళ్ల తర్వాత నాన్న ఆస్తులు తిరిగి తమకు దక్కాయని పేర్కొన్నారు.
శివ` చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు జేడీ చక్రవర్తి. రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడిగా ఆయన సినిమాల్లోకి వచ్చారు. మనీ చిత్రంతో మెయిన్‌ హీరోగా మారిపోయాడు. పెద్ద హిట్‌ అందుకుని ఒక్కసారి అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకున్నాడు. మనీ మనీ, గులాబీ, దెయ్యం, బొంబాయి ప్రియుడు, అనగనగా ఒక రోజు, ఎగిరే పావురమా, నేను ప్రేమిస్తున్నాను, పాపే నా ప్రాణం, హరిశ్చంద్ర, ప్రేమకు వేళయేరా, ప్రేమకు స్వాగతం, కాశీ, అలాగే హిందీలో సత్య వంటి చిత్రాలతో హీరోగా మెప్పించాడు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారారు. అడపాదడపా మెప్పిస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>