Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodafbcc5a6-a2ad-4e0b-a079-417023277149-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodafbcc5a6-a2ad-4e0b-a079-417023277149-415x250-IndiaHerald.jpgనాగచైతన్య సమంత ఒకప్పుడు వీళ్ళు పెద్దగా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయేవారు కాదు. కానీ ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో అప్పటినుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఏదో ఒక విషయంలో ఇక ఇద్దరి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఒకప్పుడు సమంత ఏం మాట్లాడినా కూడా ఇంటర్నెట్ జనాలు ఎంతో పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సమంత ఏం మాట్లాడినా దానిని నెగిటివ్ గానే స్వీకరిస్తూ ఉన్నారు. అంతేకాదు సమంత మాటల్లో అంతరార్థం మరొకటి ఉంది అన్నట్లుగా అర్థం చేసుకుంటూ ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే నాTollywood{#}Naga Chaitanya;Sai Pallavi;Heroine;News;Cinema;Samanthaనాగచైతన్యకు ఆమె పర్ఫెక్ట్ జోడి.. సమంత ఇలా అనేసిందేంటి?నాగచైతన్యకు ఆమె పర్ఫెక్ట్ జోడి.. సమంత ఇలా అనేసిందేంటి?Tollywood{#}Naga Chaitanya;Sai Pallavi;Heroine;News;Cinema;SamanthaSat, 24 Feb 2024 09:50:00 GMTనాగచైతన్య సమంత ఒకప్పుడు వీళ్ళు పెద్దగా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయేవారు కాదు. కానీ ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో అప్పటినుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఏదో ఒక విషయంలో ఇక ఇద్దరి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఒకప్పుడు సమంత ఏం మాట్లాడినా కూడా ఇంటర్నెట్ జనాలు ఎంతో పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సమంత ఏం మాట్లాడినా దానిని నెగిటివ్ గానే స్వీకరిస్తూ ఉన్నారు. అంతేకాదు సమంత మాటల్లో అంతరార్థం మరొకటి ఉంది అన్నట్లుగా అర్థం చేసుకుంటూ ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా సమంత కెరియర్ లో దూసుకుపోయింది. ఏకంగా వెబ్ సిరీస్ లు సినిమాలు అంటూ బిజీ బిజీగా గడిపేది. ఇలాంటి సమయంలోనే మయోసైటీస్ అనే వ్యాధి బారిన పాడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి బారిన పడిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు ఎంతో కష్టపడి ఈ మాయదారి రోగం నుంచి బయటపడింది సమంత. ఇక ఇప్పుడు మళ్లీ కెరియర్ పై దృష్టి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే ఇటీవలే తన పాడ్ కాస్టులో మాట్లాడుతూ మయోసైటిస్  వ్యాధి బారిన పడినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది సమంత.


 అదే సమయంలో ఇక హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయ్. సాయి పల్లవి మంచి యాక్టర్ అవుతుందని తనకు ఎప్పుడో తెలుసు. ఆమె మంచి డాన్సర్ కూడా. ఇక ఆమెలో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆమె డాన్సర్ గా ఉన్నప్పుడు నేను ఆ షో కి జడ్జిగా కూడా వెళ్లాను అంటూ సమంత తెలిపింది. అయితే సమంత మాటలు వెనుక అంతరార్థం మరొకటి ఉంది అంటూ ఇక ఇంటర్నెట్ జనాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏకంగా నాగచైతన్యకు సాయి పల్లవి పర్ఫెక్ట్ జోడి అని సమంత చెప్పకనే చెప్పింది అంటున్నారు. అయితే ఈ విషయం గురించి కాస్త ఆలోచిస్తున్న అక్కినేని అభిమానులు నిజమే అయ్యుంటుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే అటు నాగ చైతన్య లాగానే సాయి పల్లవి కూడా సింప్లిసిటీని ఎక్కువగా ఇష్టపడుతుంది. నిజంగానే వీరిద్దరికి పర్ఫెక్ట్ జోడి అని సినిమా జనాలు కూడా అనుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>