MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/once-again-sai-tej-showed-a-great-heart07a75874-f5bd-46f3-9419-dc30e4a8dec6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/once-again-sai-tej-showed-a-great-heart07a75874-f5bd-46f3-9419-dc30e4a8dec6-415x250-IndiaHerald.jpgఇతరులకు సాయం అందించే హీరోల్లో మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి తేజ్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే పలుమార్లు తన గొప్ప మనసును చాటుకున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అని పలు సందర్భాల్లో నిరూపించుకున్న తేజు, గతంలో ఒక ఫిలిం జర్నలిస్ట్ ఆపదలో ఉంటే, రూ.లక్షల్లో ఆర్థిక సహాయం అందించాడు. వివిధ పరిస్థితులలో అభిమానులను కూడా ఆదుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఈసారి ఇద్దరు చిన్నారులకు సాయం అందించి నెటిజన్స్ నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. tollywood{#}sai dharam tej;teja;Varsham;Supreme;Smart phone;netizens;Blockbuster hit;Accident;CBN;Audience;media;Karthik;Hero;Cinemaమరోసారి గొప్ప మనసు చాటుకున్న సాయి తేజ్మరోసారి గొప్ప మనసు చాటుకున్న సాయి తేజ్tollywood{#}sai dharam tej;teja;Varsham;Supreme;Smart phone;netizens;Blockbuster hit;Accident;CBN;Audience;media;Karthik;Hero;CinemaSat, 24 Feb 2024 13:00:00 GMTఇతరులకు సాయం అందించే హీరోల్లో మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి తేజ్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే పలుమార్లు తన గొప్ప మనసును చాటుకున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అని పలు సందర్భాల్లో నిరూపించుకున్న తేజు, గతంలో ఒక ఫిలిం జర్నలిస్ట్ ఆపదలో ఉంటే, రూ.లక్షల్లో ఆర్థిక సహాయం అందించాడు. వివిధ పరిస్థితులలో అభిమానులను కూడా ఆదుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఈసారి ఇద్దరు చిన్నారులకు సాయం అందించి నెటిజన్స్ నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు.

సాయి ధరంతేజ్ తాజాగా ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్ కి హెల్ప్ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రు బాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు తెలిసిన ఒక అనాధ శరణాలయం నుండి ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్ కి సాయం కావాలంటూ ఫోన్ రావడంతో వెంటనే సాయి ధరమ్ తేజ్ కి మెసేజ్ పెట్టగా తేజు వెంటనే రెస్పాండ్ అయి సాయం అందించారట. ఇదే విషయాన్ని ఆండ్రు బాబు తెలియజేస్తూ 'లవ్ యు తేజు' అంటూపోస్ట్ చేశారు. అంతే కాకుండా సాయి తేజ్ చేసిన సాయానికి కృతజ్ఞతగా సదరు ఆర్ఫనైజ్ పిల్లలు ధన్యవాదాలు చెబుతూ ఓ వీడియోని కూడా పంపించారు. ఆ వీడియోను సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు తన పోస్ట్కి జత చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, నేటిజన్స్ సాయి తేజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

యాక్సిడెంట్ కి ముందు సాయి తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్', 'రిపబ్లిక్' వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ఊహించని విధంగా సాయి తేజ్ కి యాక్సిడెంట్ జరిగింది. దాంతో సినిమాలకు కొన్ని నెలల గ్యాప్ తీసుకున్నాడు. యాక్సిడెంట్ నుంచి రికవరీ అయిన తర్వాత 'విరూపాక్ష' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి సాయి తేజ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>