PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-revant-congress-sharmila741ff45f-454e-4e1f-b9ed-fc7ddc42673c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-revant-congress-sharmila741ff45f-454e-4e1f-b9ed-fc7ddc42673c-415x250-IndiaHerald.jpgమొన్నటి తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధులు కేసీయార్, బీఆర్ఎస్ నేతలతోపాటు బీజేపీ నేతలపై రేవంత్ ఏస్ధాయిలో చెలరేగిపోయారో అందరు చూసిందే. ఎన్నికలన్నాక మరి ప్రత్యర్ధులపై రెచ్చిపోకుండా ఎలా ఉంటారు. సరే తెలంగాణా విషయాన్ని పక్కనపెట్టేస్తే ఏపీకి వచ్చేసరికి కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ కూటమికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముగ్గురు ప్రత్యర్ధులే. అలాగే టీడీపీ కూటమిలో చేరినా చేరకపోయినా బీజేపీ కూడా వైరిపక్షమే అవుతుందనటంలో సందేహంలేదు. telangana revant congress sharmila{#}revanth;Guntur;Narendra Modi;Tirupati;Karnataka;CBN;Pawan Kalyan;Jagan;Andhra Pradesh;YCP;Janasena;TDP;Bharatiya Janata Party;Congressహైదరాబాద్ : రేవంత్ కు పెద్ద పరీక్షహైదరాబాద్ : రేవంత్ కు పెద్ద పరీక్షtelangana revant congress sharmila{#}revanth;Guntur;Narendra Modi;Tirupati;Karnataka;CBN;Pawan Kalyan;Jagan;Andhra Pradesh;YCP;Janasena;TDP;Bharatiya Janata Party;CongressSat, 24 Feb 2024 09:00:00 GMT

తెలంగాణా ముఖ్యమంత్రికి తొందరలోనే పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. అదికూడా ఏపీ ఎన్నికల రూపంలో. ఇంతకీ విషయం ఏమిటంటే ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా రేవంత్ రెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రచారం చేయబోతున్నారు. సిద్ధరామయ్యను పక్కన పెట్టేస్తే పరీక్షంతా రేవంత్ కే ఎదురవబోతోంది. ఈనెల 25వ తేదీన తిరుపతి జిల్లాలో మొదటి బహిరంగసభ జరుగుతోంది. దానికి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవబోతున్నారు. ఇద్దరిలో రేవంత్ కు మాత్రమే ఎందుకు పరీక్షంటే  ప్రత్యర్ధుల్లో చంద్రబాబునాయుడు కూడా ఉంటారు కాబట్టే.





మొన్నటి తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధులు కేసీయార్, బీఆర్ఎస్ నేతలతోపాటు బీజేపీ నేతలపై రేవంత్ ఏస్ధాయిలో చెలరేగిపోయారో అందరు చూసిందే. ఎన్నికలన్నాక మరి ప్రత్యర్ధులపై రెచ్చిపోకుండా ఎలా ఉంటారు. సరే తెలంగాణా విషయాన్ని పక్కనపెట్టేస్తే ఏపీకి వచ్చేసరికి కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ కూటమికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముగ్గురు ప్రత్యర్ధులే. అలాగే టీడీపీ కూటమిలో చేరినా చేరకపోయినా బీజేపీ కూడా వైరిపక్షమే అవుతుందనటంలో సందేహంలేదు.





జగన్ కు వ్యతిరేకంగా ఆకాశమే హద్దుగా రేవంత్ రెచ్చిపోయే అవకాశముంది. మరి చంద్రబాబు విషయంలో ఏమిచేస్తారు ? అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. రేవంత్ కు చంద్రబాబు రాజకీయంగా గురువన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ కు చంద్రబాబు లోపాయికారీగా అన్నీవిధాలుగా సహకరించారనే ఆరోపణలకు కొదవలేదు. అలాంటిది ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేటపుడు జగన్ తో పాటు చంద్రబాబు, పవన్ను కూడా రేవంత్ టార్గెట్ చేయాలికదా..చేస్తారా ?





ఏపీకి సంబంధించి బీజేపీ మీద ఆరోపణలు చేయాలంటే విభజన చట్టాలను నరేంద్రమోడీ తుంగలోతొక్కశారంటు విరుచుకుపడాలి. విభజన చట్టాలను మోడీ తుంగలో తొక్కేయటానికి చంద్రబాబు కూడా యథాశక్తి సహకరించారని అందరికీ తెలుసు. టీడీపీ కూటమిలో ఉన్న బీజేపీని రేవంత్ టార్గెట్ చేస్తే అది చంద్రబాబుతో పాటు పవన్  కీ  తగులుతుంది. చంద్రబాబు, పవన్, బీజేపీని ఏమనకుండా అచ్చంగా జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తే జనాలు అంగీకరించరు. అప్పుడు రేవంత్ ఎంత ప్రచారంచేసినా ఎలాంటి ఉపయోగముండదు.  ఒకవేళ బీజేపీని టార్గెట్ చేస్తే టీడీపీ, జనసేన కూడా ఇబ్బందులో పడటం ఖాయం. తిరుపతిలో బహిరంగసభ తర్వాత కృష్ణా, పశ్చిమగోదావరి, కర్నూలు, గుంటూరు సభల్లో రేవంత్ పాల్గొంటారు. మరి రేవంత్ ఎవరిని టార్గెట్ చేస్తారు ? ఎవరిని వదిలేస్తారనేదే పెద్ద పరీక్ష.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>