PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan-is-in-full-active-modeaeccd446-1ac0-4073-9805-524e458fa967-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan-is-in-full-active-modeaeccd446-1ac0-4073-9805-524e458fa967-415x250-IndiaHerald.jpgలోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. వరుస సభలు ఇంకా సమావేశాలతో హోరెత్తిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెరుస్తూ సామాన్యులకు మరింత దగ్గర అవుతున్నారు.ఈ నేపథ్యంలో ఈరోజు ఒంగోలులో పర్యటించి స్థానికులు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీ, లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా ఇంకా అన్ Jagan Mohan Reddy{#}SV Mohan Reddy;Jagan;Andhra Pradesh;Dookudu;Telangana Chief Minister;Elections;Manam;Governmentదూకుడు పెంచిన సీఎం జగన్?దూకుడు పెంచిన సీఎం జగన్?Jagan Mohan Reddy{#}SV Mohan Reddy;Jagan;Andhra Pradesh;Dookudu;Telangana Chief Minister;Elections;Manam;GovernmentFri, 23 Feb 2024 17:34:45 GMTలోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. వరుస సభలు ఇంకా సమావేశాలతో హోరెత్తిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెరుస్తూ సామాన్యులకు మరింత దగ్గర అవుతున్నారు.ఈ నేపథ్యంలో ఈరోజు ఒంగోలులో పర్యటించి స్థానికులు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీ, లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా ఇంకా అన్ డివైడెడ్ షేర్ ప్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం జరిగిందని జగన్ అన్నారు. దేశ చరిత్రలో మొదటిసారి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నామని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.


''రాష్ట్రంలో పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలిచ్చే విషయంగానీ, శాశ్వతంగా మేలు చేసి అడుగులు వేసే విషయంలోగానీ, ఇళ్ల నిర్మాణం విషయంలో గానీ గత ప్రభుత్వానికి ఇంకా మన ప్రభుత్వానికి తేడా ఎంత ఉందో గమనించాలి. మనం చేసే ప్రతి పనీ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగూ పేదల జీవితాలు మారాలి, వారి బతుకులు మారాలి, పేద పిల్లలు ఎదగాలి ఇంకా భవిష్యత్ లో పేదరికం నుంచి బయటకొచ్చే పరిస్థితి రావాలని ప్రతి అడుగూ పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని, పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు గానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలుగానీ, ఏ నిబంధనలైతే వాళ్లకు పెడతామో అటువంటి నిబంధనలతో ఇళ్ల పట్టాలను అందించాం'' ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.


''ఈ 58 నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగూ కూడా ఒక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చే విధంగా అడుగులు పడ్డాయని మీ బిడ్డగా సంతోషపడుతున్నాను. గ్రామానికి, గ్రామ ప్రజలకు ఇంకా పట్టణ ప్రజలకు అందించే పౌర సేవల విషయంలో, ప్రతి ఇంటింటికీ తలుపు తట్టి అందించే సేవల విషయంలో విప్లవాత్మకమార్పులు తెచ్చి మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఈ విప్లవాలకు మూలం.. పేదలకోన్యాయం, పెద్దవారికో న్యాయం అన్న విధానాన్ని ప్రతి అడుగులో కూడా మార్చేసేయాలి అనే తపన, తాపత్రయంతో పడిన అడుగులు'' అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>