MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/it-was-me-who-encouraged-vijay-to-enter-politics-kamal-haasan5b918e83-a156-4991-8c04-4803bc4df6b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/it-was-me-who-encouraged-vijay-to-enter-politics-kamal-haasan5b918e83-a156-4991-8c04-4803bc4df6b9-415x250-IndiaHerald.jpgతమిళ హీరో తలపతి విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం కాబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల్లో సైతం విజయ్‌ పోటీ చేయనున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై అభిమానులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సైతం tollywood{#}Shiva;lord siva;Tamilnadu;raj;Prabhas;Hero;Dalapathi;Joseph Vijay;producer;Producer;India;February;Industry;Cinemaవిజయ్ ని పాలిటిక్స్ లోకి రావాలని ప్రోత్సహించింది నేనే - కమల్ హాసన్విజయ్ ని పాలిటిక్స్ లోకి రావాలని ప్రోత్సహించింది నేనే - కమల్ హాసన్tollywood{#}Shiva;lord siva;Tamilnadu;raj;Prabhas;Hero;Dalapathi;Joseph Vijay;producer;Producer;India;February;Industry;CinemaFri, 23 Feb 2024 18:00:00 GMTతమిళ హీరో తలపతి విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం కాబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల్లో సైతం విజయ్‌ పోటీ చేయనున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై అభిమానులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సైతం దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ ని విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఓ ప్రశ్న ఎదురయింది. ఇందుకు కమల్ బదులిస్తూ.." విజయ్ కి శుభాకాంక్షలు.. అతను పాలిటిక్స్ లోకి రావాలని ఎంకరేజ్ చేసిన వారిలో నేను ఒకడిని. మేము వీటి గురించి డిస్కస్ కూడా చేసుకున్నాం. ఓ రంగంలో కొనసాగాలంటే మరో రంగాన్ని విడిచి పెట్టాలని లేదు. రాజకీయాలా? సినిమాలా? అన్నది విజయ్ వ్యక్తిగత అభిప్రాయం. అతను చేసే సినిమాలు విభిన్నంగా ఉంటాయి. నన్ను అలా చేయమంటే ఎలా? అద్భుతమైన పాటలు రాసే ఓ రచయితలా మీరు పాట రాయండి అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఎవరి సామర్థ్యం వారిది. నేనైతే రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు కూడా చేస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.

'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'ఇండియన్ 2', 'థగ్ లైఫ్', KH237 వంటి సినిమాలతో పాటు పాన్ ఇండియా హీరో ప్రభాస్ 'కల్కి2898AD' లో విలన్ గా కనిపించనున్నాడు. హీరో గానే కాకుండా నిర్మాత గానూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలో ఇప్పటికే శివ కార్తికేయన్ హీరోగా 'అమరన్' సినిమా రూపొందుతోంది. దీంతోపాటు శింబుతో మరో సినిమాను నిర్మిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>