MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-movie-b9c6f549-f23c-468c-b49d-16c7069131b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-movie-b9c6f549-f23c-468c-b49d-16c7069131b4-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా క్రేజ్ అనేది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండీగా మారుతోంది. క్రేజ్ కోసం మార్కెట్లో విస్తరిస్తుండడంతో ఫిలిం మేకర్స్ ముందుగా పాన్ ఇండియా సినిమాలంటూ ప్రకటించేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రెండు భాగాలుగా సినిమాలను తెరకెక్కించే విధంగానే ప్లాన్ చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళిని చాలామంది డైరెక్టర్లు సైతం ఫాలో అవుతూ ఉన్నారు.. అయితే చాలామంది సీక్వెల్స్ ప్రకటిస్తూ ఉండడంతో అలా వారు ప్రకటించిన సినిమాలకు అంత మేటర్ ఉందా? నిజంగానే అంత అవసరమా? అనే విషయాన్ని పక్కన పెడితే స్టార్ హీరోల సినిమాలను భారీ బడ్జKALKI;MOVIE;{#}Bahubali;vijay kumar naidu;Rajamouli;Prabhas;India;News;Cinemaఅసలు కల్కి సినిమా సీక్వెల్ కూడా ఉంటుందా..?అసలు కల్కి సినిమా సీక్వెల్ కూడా ఉంటుందా..?KALKI;MOVIE;{#}Bahubali;vijay kumar naidu;Rajamouli;Prabhas;India;News;CinemaFri, 23 Feb 2024 07:00:00 GMTపాన్ ఇండియా క్రేజ్ అనేది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండీగా మారుతోంది. క్రేజ్ కోసం మార్కెట్లో విస్తరిస్తుండడంతో ఫిలిం మేకర్స్ ముందుగా పాన్ ఇండియా సినిమాలంటూ ప్రకటించేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రెండు భాగాలుగా సినిమాలను తెరకెక్కించే విధంగానే ప్లాన్ చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళిని చాలామంది డైరెక్టర్లు సైతం ఫాలో అవుతూ ఉన్నారు.. అయితే చాలామంది సీక్వెల్స్ ప్రకటిస్తూ ఉండడంతో అలా వారు ప్రకటించిన సినిమాలకు అంత మేటర్ ఉందా? నిజంగానే అంత అవసరమా? అనే విషయాన్ని పక్కన పెడితే స్టార్ హీరోల సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.


అయితే ఇప్పటివరకు తరకెక్కిస్తున్న సినిమాలలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD సినిమా సీక్వెల్ గురించి ఇప్పటి వరకు ఏ విధంగా క్లారిటీ రాలేదు.. ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్, కమలహాసన్ ,దీపికా పదుకొనే, దిశాపటాని వంటి వారు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు చిత్ర బృందం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కేవలం మీడియాలో మాత్రమే పలు రకాల వార్తలయితే వినిపిస్తున్నాయి.. కల్కి సినిమా కేవలం హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.


ఇండియన్ ఎపిక్ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ చిత్రమని కథను మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కచ్చితంగా రెండు లేదా మూడు భాగాలు తెరకెక్కించే అవకాశాలు అయితే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఇలాంటి ట్రెండును ఫాలో అవ్వలేదు.. క్రేజ్ కోసం కానీ బిజినెస్ కోసం కానీ పార్ట్-2 తీస్తున్నట్లు ఎక్కడ ప్రకటించలేదు.. గతంలో రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమా అంటూ కూడా విభజించారు. కే జి ఎఫ్, పొన్నియన్ సెల్వన్, పుష్ప సలార్ దేవర ఇలా అన్ని సినిమాలు కూడా సీక్వెల్స్ ని అనౌన్స్మెంట్ చేశారు. కానీ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా గురించి ఎలాంటి సీక్వెల్ ని అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. మరి థియేటర్లో సడన్ సర్ప్రైజ్ ఇస్తారేమో చూడాలి. మే 9వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>