EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modia2bfd03d-30ff-42bd-95e1-9bda051fb6cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modia2bfd03d-30ff-42bd-95e1-9bda051fb6cf-415x250-IndiaHerald.jpgఅవసరం మనది అయినప్పుడు అవతలి వాళ్లు పెట్టే షరతులు చాలా కఠినంగా ఉంటాయి. పగటి పూట పిలిచి మరీ రూ.20కి ఎక్కించుకొనే ఆటో వాటా రాత్రి మన అవసరం అయినప్పుడు రూ.100 అడుగుతాడు. లేకపోతే నడిచి వెళ్లండి అంటూ ఉచిత సలహా ఇస్తాడు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఇలానే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒంటరిగా వెళ్లి సీఎం జగన్ ను ఎదుర్కోలేడు. అలా అని బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటే వాళ్లు ఏమో సరిగా స్పందించడం లేదు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీతో పొత్తుపై బీజేపీ పెద్దmodi{#}West Godavari;Pawan Kalyan;Ishtam;Bhimavaram;MP;AUTO;Party;Andhra Pradesh;CBN;Assembly;Bharatiya Janata Party;CMచంద్రబాబుపై మోడీకి కోపం ఇంకా పోలేదా?చంద్రబాబుపై మోడీకి కోపం ఇంకా పోలేదా?modi{#}West Godavari;Pawan Kalyan;Ishtam;Bhimavaram;MP;AUTO;Party;Andhra Pradesh;CBN;Assembly;Bharatiya Janata Party;CMFri, 23 Feb 2024 10:07:03 GMTఅవసరం మనది అయినప్పుడు అవతలి వాళ్లు పెట్టే షరతులు చాలా కఠినంగా ఉంటాయి. పగటి పూట పిలిచి మరీ రూ.20కి ఎక్కించుకొనే  ఆటో వాటా రాత్రి మన అవసరం అయినప్పుడు రూ.100 అడుగుతాడు. లేకపోతే నడిచి వెళ్లండి అంటూ ఉచిత సలహా ఇస్తాడు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఇలానే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఒంటరిగా వెళ్లి సీఎం జగన్ ను ఎదుర్కోలేడు. అలా అని బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటే వాళ్లు ఏమో సరిగా స్పందించడం లేదు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీతో పొత్తుపై బీజేపీ పెద్దగా ఆసక్తి లేదన్నట్లు కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడిపై బీజేపీ అగ్రనేతలు గుర్రుగా ఉన్నారని చెప్పవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పొత్తుల కోసం బీజేపీ అగ్ర నాయకులు దగ్గర ఎన్ని చివాట్లు తిన్నానో మీకు తెలియదు.


ఎన్ని తిట్టినా భరించి చేతులు జోడించి దండాలు పెట్టి మరీ రాష్ట్రం నాశనం అయిపోతుంటే చూడలేక  జాతీయ నాయకులను ఒప్పించానని భీమవరం సభలో తన కష్టాన్ని, ఆవేదనను అర్థం చేసుకోవాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. తన కోసం తన పార్టీ కోసం చేయలేదుని.. ఏపీ భవిష్యత్తు కోసమే ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు.


పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే బీజేపీకి టీడీపీతో పొత్తు ఇష్టం లేదు. కానీ పవన్ కల్యాణ్ ఒత్తిడి మేరకే చంద్రబాబుని చర్చలకు పిలిచింది. కానీ బీజేపీ అధిష్ఠానం పవన్ కోసం తమ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటుందా.  సీట్ల విషయంలో తలొగ్గి పది అసెంబ్లీ స్థానాలు, ఓ రెండు, మూడు ఎంపీ స్థానాలు తీసుకొని సర్దుకుపోతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పటికీ పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగడం లేదు. అంటే పవర్ షేరింగ్ విషయంలోనో.. లేక ఇంకో దాంట్లోనో ఏదో ఒక షరతు పెట్టకపోతే ఇంత సైలెంట్ గా ఎందుకు ఉంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>