PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-bhuvaneswari-kuppam4dbd320f-a165-4276-bd3d-ec5954b43a88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-bhuvaneswari-kuppam4dbd320f-a165-4276-bd3d-ec5954b43a88-415x250-IndiaHerald.jpgరాష్ట్రరాజకీయాల నుండి తప్పుకుని జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా అమిత్ షా సూచించినట్లు సమాచారం. చంద్రబాబుకే కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా ఇదే చెప్పారట. ఇద్దరు కూడా రాష్ట్రరాజకీయాల్లో అనవసరమని వాళ్ళ సేవలు కేంద్రంలో చాలా అవసనమని అమిత్ షా చెప్పినట్లుగా ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే కుప్పం నుండి పోటీనుండి తప్పుకునే విషయమై భువనేశ్వరి ద్వారా తన మనసులోని మాటను చంద్రబాబే చెప్పించారట.tdp chandrababu bhuvaneswari kuppam{#}bhuvaneshwari;Amith Shah;kuppam;Nara Bhuvaneshwari;politics;Yevaru;Janasena;CBN;Pawan Kalyan;Partyఅమరావతి : చంద్రబాబు రాష్ట్రంలో చేతులెత్తేసినట్లేనా ?అమరావతి : చంద్రబాబు రాష్ట్రంలో చేతులెత్తేసినట్లేనా ?tdp chandrababu bhuvaneswari kuppam{#}bhuvaneshwari;Amith Shah;kuppam;Nara Bhuvaneshwari;politics;Yevaru;Janasena;CBN;Pawan Kalyan;PartyFri, 23 Feb 2024 03:00:00 GMT

రాష్ట్ర రాజకీయాలు చాలా స్పీడుగా మారిపోతున్నాయి. జరుగుతున్న పరిణామాల్లో ఏ ఒక్కటి కూడా చంద్రబాబానాయుడు, పవన్ కల్యాణ్ కు అనుకూలంగా కనబడటంలేదు. కుప్పం పర్యటనలో భువనేశ్వరి మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి తాను పోటీచేద్దామని అనుకుంటున్నట్లు చెప్పారు. తాను నవ్వలాటకే అలా చెప్పినట్లు చివరలో ఆమె చెప్పినా దాన్ని జనాలు ఎవరు నమ్మటంలేదు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు పోటీచేయరు అనే ప్రచారం మొదలై చివరకు అసలు చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో పోటీనే చేయటంలేదనే ప్రచారం ఊపందుకుంది.





కుప్పంలో పోటీచేసినా తనకు ఓటమి ఖాయమనే భయం చంద్రబాబులో పెరిగిపోతున్న కారణంగానే తన భార్యను రంగంలోకి దింపాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఢిల్లీలో అమిత్ షా ను చంద్రబాబు కలిసిన దగ్గర నుండి రాజకీయ సమీకరణల్లో చాలా వేగంగా మార్పులు మొదలైపోయాయట. చంద్రబాబు వయసు 74 ఏళ్ళు కాబట్టి రాష్ట్రరాజకీయాలనుండి తప్పుకోమని అమిత్ షా సలహా ఇచ్చినట్లు ప్రచారం మొదలైంది.





రాష్ట్రరాజకీయాల నుండి తప్పుకుని జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా అమిత్ షా సూచించినట్లు సమాచారం. చంద్రబాబుకే కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా ఇదే చెప్పారట. ఇద్దరు కూడా రాష్ట్రరాజకీయాల్లో అనవసరమని వాళ్ళ సేవలు కేంద్రంలో చాలా అవసనమని అమిత్ షా చెప్పినట్లుగా ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే కుప్పం నుండి పోటీనుండి తప్పుకునే విషయమై భువనేశ్వరి ద్వారా తన మనసులోని మాటను చంద్రబాబే చెప్పించారట.





జనాల రెస్పాన్స్ చూసుకుని, ఫీడ్ బ్యాక్ తీసుకుని తర్వాత ఏ విషయం ఫైనల్ చేద్దామన్నది చంద్రబాబు ప్లానట. అయితే పార్టీ నేతలను నియంత్రించే కెపాసిటీని చంద్రబాబు ఎప్పుడో కోల్పోయారు. జనసేనతో సీట్ల సర్దుబాటునే సక్రమంగా చేయలేకపోతున్నారు. బీజేపీని ఎలా డీల్ చేయాలో అర్ధంకాక కిందా మీదా అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ, జనసేన నేతల మధ్య వివిధ నియోజకవర్గాల్లో గొడవలైపోతున్నాయి. అయినా వీటిల్లో ఒక్కదాన్ని కూడా సర్దుబాటు చేయలేకపోతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాతే రాష్ట్రరాజకీయాల్లో చంద్రబాబు చేతులెత్తేసినట్లు అనుమానంగా ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>