PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kuppam-bhuvaneswari-naidu-bjpec8feb38-d8dd-4d12-b991-d3de42587662-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kuppam-bhuvaneswari-naidu-bjpec8feb38-d8dd-4d12-b991-d3de42587662-415x250-IndiaHerald.jpgఅలాంటిది 2019 ఎన్నికల్లో ఓటమి, తర్వాత స్ధానిక ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్ తో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయింది. దానికి తగ్గట్లే వచ్చేఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని జగన్ చేసిన చాలెంజ్ తో వణుకుమొదలైంది. అందుకనే రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు పోటీచేయకపోవచ్చనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు రెస్టు తీసుకుంటారు, తాను పోటీచేస్తానని ప్రకటించారు. తన మాటలతో చంద్రబాబుకు డ్యామేజి జరుగుతుందని భువనేశ్వరి ఊహించలేదా అన్న ప్రశ్న పkuppam bhuvaneswari naidu bjp{#}bhuvaneshwari;JOGI RAMESH;Reddy;Nara Bhuvaneshwari;Wife;Jagan;YCP;CBN;Industry;Hanu Raghavapudiరాయలసీమ : చంద్రబాబుకు డ్యామేజి జరిగిపోయిందా ?రాయలసీమ : చంద్రబాబుకు డ్యామేజి జరిగిపోయిందా ?kuppam bhuvaneswari naidu bjp{#}bhuvaneshwari;JOGI RAMESH;Reddy;Nara Bhuvaneshwari;Wife;Jagan;YCP;CBN;Industry;Hanu RaghavapudiFri, 23 Feb 2024 07:00:00 GMT

అసలే జనాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఇమేజి చాలా తక్కువ. ఉన్న కాస్ల ఇమేజిని  తాజాగా భువనేశ్వరి బాగా డ్యామేజి  చేసేశారు. కుప్పంలో నేతలు, క్యాడర్ తో జరిగిన సమావేశంలో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి చంద్రబాబును రెస్టుతీసుకోమని చెబుతున్నట్లు చెప్పారు. తానే పోటీచేద్దామని అనుకుంటున్నానని కూడా భువనేశ్వరి చెప్పారు. భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా బాగా వైరల్ అయిపోయాయి.





భువనేశ్వరి మాటలు వైరల్ అయ్యాయి అనేకన్నా చంద్రబాబుకు బాగా డ్యామేజి అయిపోయిందంటే కరెక్టుగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుండి పోటీచేయరనే ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబులో ఓటమిభయం పట్టుకుంది. అందుకనే కుప్పంలో ప్రతి రెండునెలలకు మూడురోజులు చొప్పున పర్యటిస్తున్నారు. గతంలో అంటే 32 ఏళ్ళల్లో నియోజకవర్గంలో చంద్రబాబు పెద్దగా పర్యటించేవారు కాదు. ఏదన్నా శంకుస్ధాపన లేదా ప్రారంభోత్సవం ఉంటేనే వచ్చేవారు. ఎన్నికల్లో నామినేషన్ వేయాలన్నా చంద్రబాబు తరపున లాయర్లే వచ్చేవాళ్ళు.





అలాంటిది 2019 ఎన్నికల్లో ఓటమి, తర్వాత స్ధానిక ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్ తో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయింది. దానికి తగ్గట్లే వచ్చేఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని జగన్ చేసిన చాలెంజ్ తో వణుకుమొదలైంది. అందుకనే రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు పోటీచేయకపోవచ్చనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు రెస్టు తీసుకుంటారు, తాను పోటీచేస్తానని ప్రకటించారు. తన మాటలతో చంద్రబాబుకు డ్యామేజి జరుగుతుందని భువనేశ్వరి ఊహించలేదా అన్న ప్రశ్న పెరిగిపోతోంది.





భువనేశ్వరి తమాషాకి చేసిన ప్రకటనగా జనాలు చూడటంలేదు. చంద్రబాబులోని భయం భువనేశ్వరి మాటల్లో  కనబడుతోందనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. ఎల్లోమీడియా కావాలనే భువనేశ్వరి మాటలను అండర్ ప్లే చేసినా అవకాశం దొరికింది కదాని వైసీపీ సోషల్ మీడియా+నెటిజన్ల  దెబ్బకు భువనేశ్వరి మాటలు విస్తృతంగా జనాల్లోకి  వెళ్ళిపోయింది. దాంతో చంద్రబాబుకున్న కొద్ది ఇమేజి  బాగా డ్యామేజి అయిపోయింది. భువనేశ్వరి మాటలను పట్టుకుని మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ తదితరులు తమ రియాక్షన్లతో  చంద్రబాబును మరింతగా కుళ్ళబొడుస్తున్నారు. భార్య కామెంట్ తో జరిగిన డ్యామేజీని చంద్రబాబు ఎలా భర్తీ చేసుకుంటారో  చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>