EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-ku-adrustam-kalasiranotomda71370fd3-a5af-4809-bc08-2e81ad089d5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-ku-adrustam-kalasiranotomda71370fd3-a5af-4809-bc08-2e81ad089d5c-415x250-IndiaHerald.jpgఏపీలో ఈసారి జరగబోయే ఎన్నికలు చంద్రబాబుకి చావోరేవో లాంటివి. ఎందుకంటే జగన్ మరోసారి సీఎం అయితే టీడీపీ అంత సులభంగా వదిలిపెట్టరు. అందుకే చంద్రబాబు తన శక్తినంతా కూడదీసుకోని… అదనపు శక్తి కోసం జనసేనతో కలిసి పోరాడుతున్నారు. దీంతో పాటు బీజేపీ ని కలుపుకొని వెళ్లేందుకు శాయ శక్తులా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కలిస్తే ఈ కూటమికి కొంత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. అదెలా అంటే.. కేంద్రంలో మూడో సారి మోదీ రావడం ఖాయమని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. తద్వారా తటస్థ ఓటర్లతో పాటు యువ ఓటర్లు తమ కూటమిchandrababu{#}Amith Shah;Madhya Pradesh - Bhopal;Narendra Modi;CBN;Shakti;Yuva;Bharatiya Janata Party;Jagan;Elections;TDP;CMచంద్రబాబుకు అదృష్టం కలసిరాబోతోందా?చంద్రబాబుకు అదృష్టం కలసిరాబోతోందా?chandrababu{#}Amith Shah;Madhya Pradesh - Bhopal;Narendra Modi;CBN;Shakti;Yuva;Bharatiya Janata Party;Jagan;Elections;TDP;CMFri, 23 Feb 2024 10:00:00 GMTజగన్ మరోసారి సీఎం అయితే టీడీపీ అంత సులభంగా వదిలిపెట్టరు. అందుకే చంద్రబాబు తన శక్తినంతా కూడదీసుకోని… అదనపు శక్తి కోసం జనసేనతో కలిసి పోరాడుతున్నారు. దీంతో పాటు బీజేపీ ని కలుపుకొని వెళ్లేందుకు శాయ శక్తులా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కలిస్తే  ఈ కూటమికి కొంత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది.


అదెలా అంటే.. కేంద్రంలో మూడో సారి మోదీ రావడం ఖాయమని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. తద్వారా తటస్థ ఓటర్లతో పాటు యువ ఓటర్లు తమ కూటమి వైపు చూస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో 1999లో, 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది అందుకే.  అందులో విజయం సాధించగలిగారు.  మరోసారి అదే ఫార్ములాను అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అప్పట్లో వాజ్ పేయీ, 2014లో మోదీ హవా వీస్తుందనే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు సఫలీకృతం అయ్యారు.


ఇప్పుడు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షా సూచన మేరకు పనిచేస్తారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగియడంతో ఎన్నికల వరకు మరో ఆరు నెలలు ఆయన్నే బీజేపీ జాతీయాధ్యక్షుడిగా నియమించారు. ఆయన్ను మచ్చిక చేసుకోవడం చంద్రబాబుకి కొంత సమయం పట్టింది. ఈ సారి అధ్యక్ష పీఠాన్ని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు దక్కుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.


అందుకే ఆయన సీఎం పదవిని వదులు కోవాల్సి వచ్చిందనే ప్రచారం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే చంద్రబాబుకి అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆయనతో చంద్రబాబుకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో 2014లో టీడీపీతో పొత్తుకు నరేంద్ర మోదీ ఒప్పుకోకపోతే మధ్యవర్తిత్వం వహించి ఒప్పించింది శివరాజ్ సింగ్ చౌహానే అనే వాదన ఉంది. కాబట్టి చంద్రబాబుకి రాబోయే కాలంలో కలిసొచ్చే అదృష్టం కనిపిస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>