Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplc7005a6d-09a6-445d-b598-53dee8143bce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplc7005a6d-09a6-445d-b598-53dee8143bce-415x250-IndiaHerald.jpgబిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో టైటిల్ విజేతగా నిలవడం అంటే అంత సులభమైన విషయం కాదు.. ఎందుకు ఈజీ కాదు ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఐదు సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు టైటిల్ గెలుచుకున్నాయ్. ఇంకొన్ని జట్లు కూడా టైటిల్స్ అందుకున్నాయి అంటారా.. అయితే ఐపీఎల్ టైటిల్ గెలవడం అంత సులభమైన విషయం కాదు అన్నది ఆర్సిబిని జట్టును చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మహా మహా ప్లేయర్లు జట్టులో ఉన్న ఆ జట్టుకు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ దక్కలేదు. అలాంటిది తొలి ప్రయత్నం లోనే అటు గుజరIpl{#}Hardik Pandya;Mohammed Shami;Gujarat - Gandhinagar;Maha;Chennai;Champion;Mumbai;Indian;Yuva;Yevaruఅయ్యో పాపం.. గుజరాత్ టైటాన్స్ కి ఇంత బ్యాడ్ టైం నడుస్తుందేంటి గురూ?అయ్యో పాపం.. గుజరాత్ టైటాన్స్ కి ఇంత బ్యాడ్ టైం నడుస్తుందేంటి గురూ?Ipl{#}Hardik Pandya;Mohammed Shami;Gujarat - Gandhinagar;Maha;Chennai;Champion;Mumbai;Indian;Yuva;YevaruFri, 23 Feb 2024 11:30:00 GMTబిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో టైటిల్ విజేతగా నిలవడం అంటే అంత సులభమైన విషయం కాదు.. ఎందుకు ఈజీ కాదు ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఐదు సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు టైటిల్ గెలుచుకున్నాయ్. ఇంకొన్ని జట్లు కూడా టైటిల్స్ అందుకున్నాయి అంటారా.. అయితే ఐపీఎల్ టైటిల్ గెలవడం అంత సులభమైన విషయం కాదు అన్నది ఆర్సిబిని జట్టును చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మహా మహా ప్లేయర్లు జట్టులో ఉన్న ఆ జట్టుకు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ దక్కలేదు. అలాంటిది తొలి ప్రయత్నం లోనే అటు గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపిఎల్ టైటిల్ ఎగరేసుకుపోయింది.


 కొన్నాళ్ళ వరకు ఈ విషయాన్ని కూడా ఎవరు నమ్మలేకపోయారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేసినప్పుడే అతను కెప్టెన్ ఏంటి అని అని అనుకున్నారు కొంతమంది. కానీ అతని కెప్టెన్సీలో అద్భుతంగా రానించి ఐపీఎల్ టైటిల్ గెలిస్తే.. ఇది నిజమేనా అని నమ్మడానికి కూడా కొంతమంది ప్రేక్షకులకు కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత గుజరాత్ ఆట తీరును చూసి గుజరాత్ కి టైటిల్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అందరూ అర్థం చేసుకున్నారు. అయితే మొదటి ప్రయత్నంలో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్  రెండో ప్రయత్నంలో ఫైనల్ వరకు వెళ్ళింది. ఇక హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ కి తిరుగు లేదని తప్పకుండా మరో ఛాంపియన్ టీం గా అవతరిస్తుందని అందరూ అనుకున్నారు.


 కానీ అంతలోనే కెప్టెన్ హార్దిక్  జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇంకేముంది జట్టులో ఎలాంటి అనుభవం లేని యువ ఆటగాడు గిల్ చేతిలో సారధ్య బాధ్యతలు పెట్టింది జట్టు యాజమాన్యం. అయితే అటు  గుజరాత్ టైటాన్స్ జట్టుకు పూర్తిగా బ్యాడ్ టైం నడుస్తుంది అన్నది తెలుస్తుంది   ఇప్పటికే జట్టు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ దూరం అవ్వగా ఇక జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న మహమ్మద్ షమీ 2024 ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి కోలుకోకపోవడమే దీనికి కారణం అనేది తెలుస్తుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్నుముక సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో గుజరాత్ ప్రస్థానం ఎలా ఉంటుంది అన్నది కూడా  ఆందోళనకరంగానే మారిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>