MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbbfc64b9-8f79-4576-81a9-ee8a6b88911f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbbfc64b9-8f79-4576-81a9-ee8a6b88911f-415x250-IndiaHerald.jpgసెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'.'RRR' సినిమా తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై సుమారు ఏడాది మనకు పైగా కావస్తోంది కానీ ఇప్పటిదాకా చిత్రీకరణ పూర్తవలేదు దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ లోనూ బిజీ అయ్యారు. tollywood{#}king;Ramoji Film City;NTR;september;Press;Hyderabad;Darsakudu;March;Chitram;producer;Producer;Ram Charan Teja;Pawan Kalyan;India;Director;Cinema;Newsయాక్షన్ మోడ్ లో రామ్ చరణ్యాక్షన్ మోడ్ లో రామ్ చరణ్tollywood{#}king;Ramoji Film City;NTR;september;Press;Hyderabad;Darsakudu;March;Chitram;producer;Producer;Ram Charan Teja;Pawan Kalyan;India;Director;Cinema;NewsFri, 23 Feb 2024 17:50:00 GMTసెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'.'RRR' సినిమా తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై సుమారు ఏడాది మనకు పైగా కావస్తోంది కానీ ఇప్పటిదాకా చిత్రీకరణ పూర్తవలేదు దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ లోనూ బిజీ అయ్యారు. రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కించడంతో 'గేమ్ ఛేంజర్' మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డ మూవీ టీం తాజాగా లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.

'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 70 నుంచి 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం పెండింగ్ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారట. ఈ క్రమంలోనే 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో సినిమాకు సంబంధించి కీలక షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ నిర్మించిన ఓ ప్రత్యేక సెట్ లో షూటింగ్ చేస్తున్నారట. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ అన్బరివ్ నేతృత్వంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మార్చి తొలివారం వరకూ ఈ చిత్రీకరణ ఉంటుందని తెలిసింది. రీసెంట్ గానే ఈ షెడ్యూల్ ని స్టార్ట్ చేసిందట మూవీ టీం.

నిర్మాత దిల్ రాజు ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ లో 'గేమ్ చేంజర్' సినిమాని సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. వినాయక చవితి కానుగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఆ డేట్ కు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'OG' సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో 'గేమ్ ఛేంజర్' విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దసరాకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించగా.. ఆ సమయానికి ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్ అవుతోంది. సో 'గేమ్ ఛేంజర్' దసరాకి రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. మరి సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి మేకర్స్ నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>