EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/war0d3a4f3d-c16d-4ac9-b5ae-c982eda7e8dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/war0d3a4f3d-c16d-4ac9-b5ae-c982eda7e8dd-415x250-IndiaHerald.jpgఅగ్ర రాజ్యాలు అమెరికా.. రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ప్రపంచం కొన్ని దశాబ్దాల పాటు ఊపిరి బిగపట్టి చూసింది. అయితే సోవియట్ రష్యా ముక్కలు కావడంతో రష్యా తన ప్రాభవాన్ని కొంత మేర కోల్పోయింది. అయినా ఆయుధాల రేసులో వెనకడలేదని అమెరికాకు షాక్ ఇచ్చే స్థాయిలో ఉన్నామని తాజా సమాచారంతో మరోసారి రుజువైంది. ఈ సారి ఏకంగా అంతరిక్షంలోకి అణ్వాయుధాన్ని పంపేలా రష్యా చూస్తోందంటూ అమెరికా నిఘా విభాగం పేర్కొంది. తాజాగా ఈ ప్రకటన ఆ దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనwar{#}mithra;Russia;American Samoa;Government;MP;mediaఆ దేశాల మధ్య అంతరిక్షంలో అణు యుద్ధం?ఆ దేశాల మధ్య అంతరిక్షంలో అణు యుద్ధం?war{#}mithra;Russia;American Samoa;Government;MP;mediaThu, 22 Feb 2024 23:00:00 GMTఅగ్ర రాజ్యాలు అమెరికా.. రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ప్రపంచం కొన్ని దశాబ్దాల పాటు ఊపిరి బిగపట్టి చూసింది. అయితే సోవియట్ రష్యా ముక్కలు  కావడంతో రష్యా తన ప్రాభవాన్ని కొంత మేర కోల్పోయింది. అయినా ఆయుధాల రేసులో వెనకడలేదని అమెరికాకు షాక్ ఇచ్చే స్థాయిలో ఉన్నామని తాజా సమాచారంతో మరోసారి రుజువైంది.


ఈ సారి ఏకంగా అంతరిక్షంలోకి అణ్వాయుధాన్ని పంపేలా రష్యా చూస్తోందంటూ అమెరికా నిఘా విభాగం పేర్కొంది.  తాజాగా ఈ ప్రకటన ఆ దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై అమెరికా నిఘా విభాగం కమిటీ ఛైర్మన్ ఎంపీ మైక్ టర్నర్  ప్రకటన విడుదల చేశారు. అమెరికాకు పొంచి ఉన్న ముప్పుతో పాటు ప్రభుత్వం దేశ ప్రజలకు తెలియాలని, మిత్ర దేశాలకు కూడా హెచ్చరించాలని టర్నర్ సూచించారు.


దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ రష్యాతో ప్రస్తుతం అమెరికా ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని ప్రపంచ దేశాలకు అలాంటి ప్రమాదం లేదని వ్యాఖ్యానించారు. అయితే సదరు అణ్వాయుధాన్ని భూమ్మీద ఉన్న లక్ష్యాల కోసం కాకుండా అంతరిక్షంలో ఉన్న ఉప గ్రహాల పై ప్రయోగిండచానికి రష్యా తయారు చేయాలని భావిస్తోందని మీడియా పేర్కొంది. అయితే అణ్వాయుధం రోదసీలో ఉంటే దానిని భూమ్మీది లక్ష్యాలతో పాటు ఎక్కడికైనా ప్రయోగించే అవకాశం ఉటుందని వాదన కూడా ఉంది.


రష్యా ప్రయోగించనున్న అణ్వాయుధం ప్రస్తుతం ఊహాగానాలే తప్ప ఎటువంటి స్పష్టత లేదు. మూడు అంచనాలు మాత్రం ఉన్నాయి. మొదటిది.. ఏకంగా ఓ అణ్వాయుధాన్ని క్షక్ష్యలోకి ప్రవేశపెట్టి అవసరం వచ్చినప్పుడు అక్కడి నుంచే ప్రయోగించడం రెండోది.. అణుశక్తితో నడిచే ఉపగ్రహం. ఇది స్వయంగా బాంబు కాకపోవచ్చు గానీ దాంట్లోని పరికరాలను అణుశక్తితో నడిపిస్తారు. మూడోది.. ఉపగ్రహాలను ధ్వంసం చేసే అణ్వాయుధం. దీనిని భూమి మీద నిలిపి ఉంచుతారు. అవసరం అయినప్పుడు ప్రయోగిస్తారు. దీనిపై రష్యా స్పందిస్తూ ఇదంతా తప్పుడు ప్రచారం అని తోసిపుచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>