PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sammakka11eeaae0-8d23-4831-8cbb-b65f22bd88d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sammakka11eeaae0-8d23-4831-8cbb-b65f22bd88d6-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఆసియాలోనే అతి పెద్దదైన గిరిజన జాతర జరుగుతోంది. అన్ని దారులు మేడారం వైపు దారి తీస్తున్నాయి. ప్రకృతిని ప్రేమించు ప్రకృతితో జీవించు అన్న భారతీయ సనాతన ధర్మ సందేశాన్ని మనకు సమ్మక్క - సారలమ్మ చరిత్ర తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన బండి ఉష సంపాదకత్వంలో మేడారం జాతరపై ప్రత్యేకంగా "ఆత్మగౌరవ ప్రతీక" పేరిట సాహితీ సంకలనాన్ని రూపొందించారు. ఈ పద్యాలు, కవితలు సమ్మక్క - సారలమ్మల చరిత్ర, మేడారం జాతర ప్రాముఖ్యతను వివరంగా ఆవిష్కరించాయి. ప్రకృతి కోసం, ప్రకృతిని నమ్ముకున్న సామాన్య ప్రజాsammakka{#}prakruti;Usha Mulpuri;Khammam;venkaiah naidu;Medaram;Culture;dharma;history;festival;Hyderabad;Telugu;Telanganaసమ్మక్క, సారలమ్మలకు 535 మంది కవితాంజలి?సమ్మక్క, సారలమ్మలకు 535 మంది కవితాంజలి?sammakka{#}prakruti;Usha Mulpuri;Khammam;venkaiah naidu;Medaram;Culture;dharma;history;festival;Hyderabad;Telugu;TelanganaThu, 22 Feb 2024 08:09:41 GMTతెలంగాణలో ఆసియాలోనే అతి పెద్దదైన గిరిజన జాతర జరుగుతోంది. అన్ని దారులు మేడారం వైపు దారి తీస్తున్నాయి. ప్రకృతిని ప్రేమించు ప్రకృతితో జీవించు అన్న భారతీయ సనాతన ధర్మ సందేశాన్ని మనకు సమ్మక్క - సారలమ్మ చరిత్ర తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన బండి ఉష సంపాదకత్వంలో మేడారం జాతరపై ప్రత్యేకంగా "ఆత్మగౌరవ ప్రతీక" పేరిట సాహితీ సంకలనాన్ని రూపొందించారు. ఈ పద్యాలు, కవితలు సమ్మక్క - సారలమ్మల చరిత్ర, మేడారం జాతర ప్రాముఖ్యతను వివరంగా ఆవిష్కరించాయి.


ప్రకృతి కోసం, ప్రకృతిని నమ్ముకున్న సామాన్య ప్రజానీకోసం ప్రకృతి శక్తులుగా మారి బలాఢ్యులపై వీరోచితమైన పోరు సాగించి పరాశక్తులుగా కోట్లాది మంది ప్రజల పూజలందుకుంటున్న సమ్మక్క - సారలమ్మలకు ఇలా అక్షరాంజలి ఘటించారు. ఈ సంకలనాన్ని  హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల, తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ మేడారం జాతర అని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.


535 మంది రచయితలు, రచయిత్రులు... కవితలు, పద్యాలతో ఒక చక్కని సంకలనం వెలువరించటం సంతోషకరమని వెంకయ్య నాయుడు తెలిపారు. ని వెంకయ్య నాయుడు అభినందించారు. తెలంగాణ సంస్కృతిని తేట తెలుగులో, అత్యంత సరళంగా పద్యాలు, అందమైన కవితల రూపంలో తీసుకురావడం చాలా మంచి విషయమని వెంకయ్యనాయుడు చెప్పారు. భాష అంటే పరస్పరం మాట్లాడుకునే ఒక సాధనం మాత్రమే కాదని.. భాషలో సంస్కృతి అంతర్లీనంగా పెనవేసుకుపోయి ఉంటుందన్నారు.


ఒక ప్రాంతం, ఒక సమూహం సముపార్జించిన జ్ఞాన సంపద, విలువలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను తరతరాలుగా మోసుకొస్తూ ఎప్పటికప్పుడు ముందు తరాలకు అందించే ఒక సజీవ ప్రవాహం అని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. భాష పోతే శ్వాస పోయినట్లే... భాష పోతే ఒక జాతి ఉనికిపోయినట్లే... మన మాతృభాషే మన ఉనికి అని వెంకయ్యనాయుడు తెలిపారు. మన చక్కనైన, చిక్కనైన తెలుగు భాష పరిరక్షించుకుందామని వెంకయ్యనాయుడు  పిలుపు ఇచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>