MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/simhadri9ad85c21-8419-4038-aeb9-0f3d693bec64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/simhadri9ad85c21-8419-4038-aeb9-0f3d693bec64-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఏమంటూ ఈ రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ చేశారో కానీ.. ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో రీ-రిలీజుల ట్రెండ్ మితిమీరిపోతుంది.స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలను, కల్ట్ క్లాసిక్ సినిమాలను 4K రెజల్యూషన్ లో మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ వస్తున్నారు.హీరోల బర్త్ డే స్పెషల్ గానో, మరేదైనా ప్రత్యేకమైన రోజుల్లోనో రీ రిలీజ్ చేసే సినిమాలని జనాలు బాగానే ఆదరిస్తున్నారు.అలాగే మంచి వసూళ్లను అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'పోకిరి'తో మొదలైన ఈ ట్రెండ్ కొన్నినెలల పాటు పీక్స్ స్టేజిలో నడిచిందిSimhadri{#}Balakrishna;Pawan Kalyan;Simha;Mass;Ravi;ravi teja;Rajamouli;March;Tollywood;February;mahesh babu;Audience;Blockbuster hit;Director;Cinemaసింహాద్రి రీరిలీజ్: అవసరమా అధ్యక్షా?సింహాద్రి రీరిలీజ్: అవసరమా అధ్యక్షా?Simhadri{#}Balakrishna;Pawan Kalyan;Simha;Mass;Ravi;ravi teja;Rajamouli;March;Tollywood;February;mahesh babu;Audience;Blockbuster hit;Director;CinemaThu, 22 Feb 2024 16:28:54 GMTసూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఏమంటూ ఈ రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ చేశారో కానీ.. ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో రీ-రిలీజుల ట్రెండ్ మితిమీరిపోతుంది.స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలను, కల్ట్ క్లాసిక్ సినిమాలను 4K రెజల్యూషన్ లో మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ వస్తున్నారు.హీరోల బర్త్ డే స్పెషల్ గానో, మరేదైనా ప్రత్యేకమైన రోజుల్లోనో రీ రిలీజ్ చేసే సినిమాలని జనాలు బాగానే ఆదరిస్తున్నారు.అలాగే మంచి వసూళ్లను అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'పోకిరి'తో మొదలైన ఈ ట్రెండ్ కొన్నినెలల పాటు పీక్స్ స్టేజిలో నడిచింది. అయితే ఫ్లాప్ సినిమాల్ని కూడా మళ్లీ విడుదల చేస్తుండటంతో, ఓ దశలో వీటిపై ప్రేక్షకులకు కూడా మొహం మొత్తింది. దీంతో ఈ ట్రెండ్ కు బ్రేక్ పడుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే, అది ఇప్పుడప్పుడల్లా జరిగేలా కనిపించడం లేదు.ఇటీవల 'కెమెరామెన్ గంగతో రాంబాబు' మూవీని 'యాత్ర 2'కు పోటీగా రీ-రిలీజ్ చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న డజను పాత చిత్రాలను రిలీజ్ చేశారు. 'ఓయ్', 'తొలిప్రేమ' సినిమాలతో పాటు రెండేళ్ల క్రితం వచ్చిన 'సీతారామం', గతేడాది హిట్టయిన 'బేబీ' చిత్రాలని కూడా రీ రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఆగస్టు నెలలో రీరిలీజ్ చేసిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మూవీని మళ్ళీ ఆరు నెలలు తిరక్కుండానే మరోసారి థియేటర్లలో తీసుకొచ్చారు. రీసెంట్ గా ఫిబ్రవరి 17, 18 తేదీలలో 'వర్షం' మూవీ స్పెషల్ షోలు వేశారు.అలాగే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' మూవీని కూడా పలు థియేటర్లలో ప్రదర్శించారు.


ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన 'సింహాద్రి' సినిమా 4K వెర్షన్ ను 2024 మార్చి 1న రీ-రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. గత సంవత్సరం ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తే, ఆడియన్స్ నుంచి కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇంతలోనే మరోసారి విడుదల చేయడంపై నెగిటివ్ కామెంట్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. అవసరమా మళ్ళీ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అదే మార్చి 1న మాస్ మహారాజా రవితేజ నటించిన 'కిక్' 4K సినిమాని కూడా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'సమర సింహా రెడ్డి' సినిమా వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మరోసారి సినిమా హాళ్ళలో ప్రదర్శించనున్నారు. ఇది మార్చి 2వ తేదీన విడుదల అవుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టర్స్ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి. అలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా.. మార్చి 23-24 తేదీల్లో 'నాయక్' సినిమాను మళ్లీ రిలీజ్ చేయబోతున్నారు. ఇక రవితేజ, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో రూపొందిన 'దుబాయ్ శీను' మూవీని ఫిబ్రవరి 24-25 తేదీల్లో రీరిలీజ్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్.ఇలా రీ-రిలీజ్ ట్రెండ్ లో భాగంగా రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలు కూడా రాబోతున్నాయి. సమ్మర్ దాకా భారీ చిత్రాల రిలీజులు లేకపోవడాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మంచి కలెక్షన్లు వస్తుండటం, 4K రెజల్యూషన్ లోకి మార్చడానికి పెద్దగా ఖర్చు అవ్వకపోవడంతో అందరూ ఇదే బాటలో నడుస్తున్నారు. మరి ఈ ట్రెండ్ టాలీవుడ్ లో ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>