Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec5df3877-d922-4ce9-9ac9-e4cfd0712121-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec5df3877-d922-4ce9-9ac9-e4cfd0712121-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మన తెలుగు సినిమా హీరోలందరూ ఒకపక్క నటిస్తూనే మరో పక్క బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికే దాదాపు చాలా మంది హీరోలు తమ సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి తమ సొంత సినిమాలు నిర్మించడమే కాదు ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇక మరొక పక్క ఏషియన్ సంస్థతో కలిసి దియేటర్ల బిజినెస్ లోకి కూడా దిగుతున్నారు హీరోలు. ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబి, అల్లు అర్జున్ త్రిబుల్ ఎ, విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ మల్టీప్లెక్స్ తో పాటు ఇప్పుడు రవితేజ కూడా అదే బిజిsocialstars lifestyle{#}viva harsha;Mahbubnagar;Ravi;ravi teja;Master;Joseph Vijay;mahesh babu;Mass;Allu Arjun;Telugu;Cinemaఆ ఇద్దరి స్టార్ హీరోల బాటలోనే మాస్ మహారాజ్...!!ఆ ఇద్దరి స్టార్ హీరోల బాటలోనే మాస్ మహారాజ్...!!socialstars lifestyle{#}viva harsha;Mahbubnagar;Ravi;ravi teja;Master;Joseph Vijay;mahesh babu;Mass;Allu Arjun;Telugu;CinemaWed, 21 Feb 2024 23:38:38 GMTప్రస్తుతం మన తెలుగు సినిమా హీరోలందరూ ఒకపక్క నటిస్తూనే మరో పక్క బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికే దాదాపు చాలా మంది హీరోలు తమ సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి తమ సొంత సినిమాలు నిర్మించడమే కాదు ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇక మరొక పక్క ఏషియన్ సంస్థ తో కలిసి దియేటర్ల బిజినెస్ లోకి కూడా దిగుతున్నారు హీరోలు. ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబి, అల్లు అర్జున్ త్రిబుల్ ఎ, విజయ్ దేవర కొండ మహబూబ్ నగర్ మల్టీప్లెక్స్ తో పాటు ఇప్పుడు రవితేజ కూడా అదే బిజినెస్ లోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. వీరితో ఈ మల్టీప్లెక్స్ లో భాగస్వామ్యం చేసి పాపులర్ అయిన ఏషియన్ సంస్థ ఇప్పుడు మరోసారి మరో మల్టీప్లెక్స్ నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంది.దిల్షుక్నగర్ ప్రాంతం లో ఆరు స్క్రీన్ల గల ఒక అత్యాధునిక మల్టీప్లెక్స్ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు మరో ఆరు నెలల్లో దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. నిజానికి రవితేజ కూడా ఒకపక్క నిర్మాతగా మారి పలు సినిమాలు చేస్తున్న సంగతి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన తన సొంత సినిమాల కంటే ఇతరుల తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వైవా హర్ష హీరో గా తెరకెక్కిన సుందరం మాస్టర్ అనే సినిమా కూడా రవితేజ బ్యానర్ లో నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే.రవితేజ వరుస గా సినిమాలు చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం రావడం లేదు. ధమాకా తర్వాత ఈ మాస్ మహారాజ్ కి సరైన హిట్ లేదు. చివరగా విడుదలైన ఈగల్ మూవీ కూడా నిరాశపరిచింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>