EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan584aaa7a-1c7d-4710-a55d-6ef0773e2b3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan584aaa7a-1c7d-4710-a55d-6ef0773e2b3e-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే ఇక్కడ ఒకే కుటుంబం అయినా రాజకీయ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతుంటాయి. దీనికి సాక్ష్యం షర్మిల తన సోదరుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఓ రేంజ్ లో చెలరేగిపోతున్నారు. జగన్ కూడా తన అనునూయులతో షర్మిళకు కౌంటర్లు ఇప్పిస్తున్నారు. ఇక వీరితో పాటు టీడీపీ, జనసేన వర్సెస్ వైసీపీల మధ్య మాటల వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ,జనసేన కూటమిలోకి బీజేపీ చేరే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి అని పలువురjagan{#}CBN;editor mohan;Pawan Kalyan;Jagan;media;Prime Minister;politics;war;Sarva Shiksha Abhiyan;Raptadu;Narendra;Sharmila;central government;CM;Bharatiya Janata Party;Janasena;YCP;Partyజగన్.. మోదీని నిందించే సాహసం చేస్తారా?జగన్.. మోదీని నిందించే సాహసం చేస్తారా?jagan{#}CBN;editor mohan;Pawan Kalyan;Jagan;media;Prime Minister;politics;war;Sarva Shiksha Abhiyan;Raptadu;Narendra;Sharmila;central government;CM;Bharatiya Janata Party;Janasena;YCP;PartyWed, 21 Feb 2024 10:00:00 GMTఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే ఇక్కడ ఒకే కుటుంబం అయినా రాజకీయ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతుంటాయి.  దీనికి సాక్ష్యం షర్మిల తన సోదరుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఓ రేంజ్ లో చెలరేగిపోతున్నారు. జగన్ కూడా తన అనునూయులతో షర్మిళకు కౌంటర్లు ఇప్పిస్తున్నారు.


ఇక వీరితో పాటు టీడీపీ, జనసేన వర్సెస్ వైసీపీల మధ్య మాటల వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ,జనసేన కూటమిలోకి బీజేపీ చేరే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి అని పలువురు తమ సందేహాలను వెల్లబుచ్చుతున్నారు.  ఇప్పటి వరకు వైసీపీ నిర్వహించిన మూడు సిద్ధం సభల్లో కూడా టీడీపీ, జనసేనను ఏకి పారేసిన జగన్ బీజేపీ గురించి ప్రస్తావించలేదు.


చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతున్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీని పల్లెత్తుమాట కూడా అనడం లేదు. రాప్తాడు సభలో ఓ కేంద్ర పార్టీని పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నారు అన్నారు కానీ నరేంద్ర మోదీని, బీజేపీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. గతంలో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు రాగానే ప్రధానిని, కేంద్రాన్ని తన అనుకూల మీడియా ద్వారా పార్టీ నేతల ద్వారా విమర్శించారు.


ఇప్పుడు ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే గతంలో చంద్రబాబు విమర్శించినట్లుగా రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదు అని జగన్ ఆరోపణలు చేస్తారా లేదా అనేది చూడాలి. మరోవైపు ఏపీకి కేంద్రం ఇచ్చింది ఇప్పటివరకు జగన్ చెప్పలేదు. సర్వశిక్షా అభియాన్ నిధులను మళ్లించి నాడు నేడు కార్యక్రమాలు చేపట్టడం, గ్రామీణ ప్రాంత ఆసుపత్రి నిర్మాణాల్లో కేంద్రం వాటానే ఎక్కువ. ఈ విషయాన్ని ఇప్పటివరకు జగన్ చెప్పలేదు. అలాగే ఇచ్చారని చెప్పలేదు. ఇవ్వలేదని నిందించలేదు. మరీ ఈ మూడు పార్టీలు పొత్తులు పెట్టుకుంటే బీజేపీపై ఏమైనా విమర్శలు చేస్తారా లేదా అనేది చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>