PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modif6907061-a110-4385-8374-51b1ec509c7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modif6907061-a110-4385-8374-51b1ec509c7d-415x250-IndiaHerald.jpgఇటీవల భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ప్రధాని నరేంద్రమోదీ కార్యవర్గ సభ్యలుకు దిశా నిర్దేశం చేసి పంపిచారు. భారత్ ను అభివృద్ధి చెందని దేశంగా తీర్చిదిద్దాలనే భారీ లక్ష్యాన్ని సాధించడానికి వరుసగా మూడో సారి తమకు అధికారం ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత్ భారత్ దిశగా పెద్ద అడుగు వేయాలంటే దానికి తొలి షరతుగా భారీ మెజార్టీతో తిరగి భాజపా ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పారు. దిల్లీలోని భారత్ మండపంలో రెండ్రోజులు పాటు జాతీయ మండలి సమావేశం జరిగిందmodi{#}Narendra Modi;Prime Minister;Government;India;Bharatiya Janata Partyమళ్లీ గెలిపిస్తే.. మోడీ ఆ టార్గెట్‌ అందుకుంటారా?మళ్లీ గెలిపిస్తే.. మోడీ ఆ టార్గెట్‌ అందుకుంటారా?modi{#}Narendra Modi;Prime Minister;Government;India;Bharatiya Janata PartyWed, 21 Feb 2024 10:12:48 GMTఇటీవల భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ప్రధాని నరేంద్రమోదీ కార్యవర్గ సభ్యలుకు దిశా నిర్దేశం చేసి పంపిచారు. భారత్ ను అభివృద్ధి చెందని దేశంగా తీర్చిదిద్దాలనే భారీ లక్ష్యాన్ని సాధించడానికి వరుసగా మూడో సారి తమకు అధికారం ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత్ భారత్ దిశగా పెద్ద అడుగు వేయాలంటే దానికి తొలి షరతుగా భారీ మెజార్టీతో తిరగి భాజపా ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పారు.


దిల్లీలోని భారత్ మండపంలో రెండ్రోజులు పాటు జాతీయ మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని 65 నిమిషాల పాటు ప్రసంగించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాబోయే కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను ఆవిష్కరించారు. దేశాభివృద్ధిలో వచ్చే అయిదేళ్లలో అత్యంత కీలకపాత్ర.ఆ వ్యవధిలో ఇదివరకటి కంటే చాలా వేగంగా పనిచేయాలి.


వచ్చే వంద రోజుల్లో బీజేపీ కార్యకర్తలు నూతనోత్సాహంతో శ్రమించాలి. ప్రతి కొత్త ఓటరును ప్రతి వర్గాన్ని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరిని చేరుకోవాలి. వారి విశ్వాసాన్ని పొందాలి. అందరూ కలిసి ప్రయత్నిస్తే అత్యధిక సీట్లు బీజేపీకే దక్కుతాయి.  పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించడం సాధారణ విషయమేమీ కాదు.


మేం రాజకీయాల కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తున్నాం. బీజేపీ సర్కారు రావాలని నేను చెబుతోంది అధికారాన్ని అనుభవించడం కోసం కాదు. ప్రజల కోసమే. నేను నా ఇంటి గురించి ఆలోచించి ఉంటే కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చే వాళ్లం కాదు. యువత, మహిళలు, పేదల కలల సాకారం కోసం రాత్రింబవళ్లు పనిచేశాం. ఎన్నో సమస్యలు పరిష్కరించాం. దేశం లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థకు మారేందుకు దాదాపు 60 ఏళ్లు పట్టింది. గత పదేళ్లలోనే అది మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నఆర్థిక వ్యవస్థను అయిదో స్థానానికి చేర్చాం. ఇది మూడో స్థానానికి ఎగబాకితే భారత్ లో ఊహించలేని అభివృద్ధి జరుగుతుంది అని వివరించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>