HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips5925adf5-713a-4d1f-bd94-9d6d8f0c6753-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips5925adf5-713a-4d1f-bd94-9d6d8f0c6753-415x250-IndiaHerald.jpgరాగులు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. రాగుల్లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ రాగులల్లో ఫినాలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. రాగి రొట్టెలను తీసుకోవడం వల్ల చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. నHealth Tips{#}Magnesium;Sugar;bhavana;Shakti;Heart;Manamఈ రొట్టెలు తింటే ఎక్కువ కాలం జీవిస్తారు?ఈ రొట్టెలు తింటే ఎక్కువ కాలం జీవిస్తారు?Health Tips{#}Magnesium;Sugar;bhavana;Shakti;Heart;ManamTue, 20 Feb 2024 14:05:47 GMTరాగులు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. రాగుల్లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ రాగులల్లో ఫినాలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. రాగి రొట్టెలను తీసుకోవడం వల్ల చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. నీరసం మన దరి చేరకుండా ఉంటుంది. మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు.రాగి రొట్టెలను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలు గుల్లబారడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.


అంతేకాకుండా రాగి రొట్టెలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి గుండె జబ్బులు రాకుండా కాపాడడంలో సహాయపడతాయి.రాగి రొట్టెలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. అదేవిధంగా రాగులల్లో గ్లూటెన్ ఉండదు. కనుక గ్లూటెన్ సెన్సిటివిటీతో బాధపడే వారు వీటి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాగుల యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కనుక ఇవి రక్తంలోకి చక్కెరలను నెమ్మదిగా విడుదల చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. కనుక షుగర్ తో బాధపడే వారు రాగులతో రొట్టెలను చేసి తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గడంలో కూడా రాగులు మనకు సహాయపడతాయి. రాగులల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.ఎక్కువ సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>