Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death9d72256a-63fd-41d4-97e8-b1d096b44faf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death9d72256a-63fd-41d4-97e8-b1d096b44faf-415x250-IndiaHerald.jpgగుండెపోటు.. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం. ఒకప్పుడు వృద్ధాప్యంలో గుండెపోటు వచ్చేది అని అనుకునేవారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటేనే ఇలాంటి హార్ట్ ఎటాక్ బారిన పడేవారు అనుకునేవారు. అయితే గుండెపోటు వచ్చిన ఒకేసారి కి చనిపోరని రెండు మూడు సార్లు గుండెపోటు వస్తేనే చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు కూడా అప్పట్లో హెచ్చరించేవారు. కానీ ఇటీవల కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గుండెపోటు వచ్చింది అని తెలిసే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అప్పటివరకు సంతోషంగా గడిపిన వారు ఒక్Death{#}Bike;Heart Attack;Tammudu;Annayya;Thammudu;Madhya Pradesh - Bhopal;rahul;Rahul Sipligunjబైక్ పై వెళ్తుండగా గుండెపోటు.. చివరికి?బైక్ పై వెళ్తుండగా గుండెపోటు.. చివరికి?Death{#}Bike;Heart Attack;Tammudu;Annayya;Thammudu;Madhya Pradesh - Bhopal;rahul;Rahul SipligunjTue, 20 Feb 2024 08:30:00 GMTగుండెపోటు.. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం. ఒకప్పుడు వృద్ధాప్యంలో గుండెపోటు వచ్చేది అని అనుకునేవారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటేనే ఇలాంటి హార్ట్ ఎటాక్ బారిన పడేవారు అనుకునేవారు. అయితే గుండెపోటు వచ్చిన ఒకేసారి కి చనిపోరని రెండు మూడు సార్లు గుండెపోటు వస్తేనే చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు కూడా అప్పట్లో హెచ్చరించేవారు. కానీ ఇటీవల కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గుండెపోటు వచ్చింది అని తెలిసే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అప్పటివరకు సంతోషంగా గడిపిన వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయి క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్నారు.


 అయితే నేటి రోజుల్లో గుండెపోటు ఎవరికి వస్తుంది అన్నది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. దీంతో ఎప్పుడు ఎవరిని హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలను తీసేస్తూ ఉంది అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది. దీంతో ప్రతిక్షణం కూడా ప్రతి ఒక్కరు భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా అతను బైక్ పై వెళుతున్న సమయంలో ఒక్కసారిగా సడన్ హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో చివరికి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.


 మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడు బైక్ నడుపుతూ ఉండగా వెనక కూర్చున్నాడు అన్నయ్య 26 ఏళ్ళ రాహుల్. ఈ క్రమంలోనే అతనికి సడన్ హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఈ క్రమంలోనే బైక్ కూడా అదుపుతప్పడంతో ముందు వాహనాన్ని నడుపుతున్న తమ్ముడు కూడా కింద పడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే వారిని పైకి లేపి ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు రాహుల్ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అతని మరణానికి గుండెపోటే కారణమని తేల్చారు. ఇలా అప్పటి వరకు ఆనందంగా గడిపిన అన్నయ్య ఇలా సడన్ గా గుండెపోటుతో మరణించడంతో తమ్ముడు షాక్ లో మునిగిపోయాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>