Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0c4d4bec-143f-4d94-95e8-e65ca540e2d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0c4d4bec-143f-4d94-95e8-e65ca540e2d6-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు వరుణ్ సందేశ్ ఒకరు. ఇలా ఈయన హీరోగా హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అనంతరం పలు సినిమాలలో నటించారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.ఈ విధంగా వరుణ్ సందేశ్ నటి వితికా షేరు తో కలిసి ఓ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం అనంతరం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలsocialstars lifestyle{#}you tube;Happy days;American Samoa;Success;varun sandesh;marriage;media;India;Cinemaఆ మ్యాటర్ పై స్పందించిన వరుణ్ సందేశ్ దంపతులు....!!ఆ మ్యాటర్ పై స్పందించిన వరుణ్ సందేశ్ దంపతులు....!!socialstars lifestyle{#}you tube;Happy days;American Samoa;Success;varun sandesh;marriage;media;India;CinemaTue, 20 Feb 2024 22:46:43 GMTసినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు వరుణ్ సందేశ్ ఒకరు. ఇలా ఈయన హీరోగా హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అనంతరం పలు సినిమాలలో నటించారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.ఈ విధంగా వరుణ్ సందేశ్ నటి వితికా షేరు తో కలిసి ఓ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం అనంతరం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలా పెళ్లి చేసుకున్నటువంటి వీరిద్దరూ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇటీవల బిగ్ బాస్కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత వితికా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.
ఇలా తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని వీరిద్దరూ తాజాగా తమ పిల్లల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి జరిగి దాదాపు ఆరేడు సంవత్సరాలు అవుతుంది ఈ క్రమంలోనే పిల్లల గురించి తరచూ వారికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి అంటూ ఈమె ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మేము పిల్లల గురించి ఏ విధమైనటువంటి ప్లాన్స్ చేయలేదు కానీ 2018 వ సంవత్సరంలో నేను ప్రెగ్నెంట్ అయ్యానని కానీ 40 డేస్ తర్వాత మిస్ క్యారేజ్ అయింది అంటూ వితికా తెలిపారు.  ఇలా మిస్ క్యారేజ్ అయిన తర్వాత మేము అమెరికా నుంచి ఇండియా వచ్చేసాం అని కొద్దిరోజులు మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వడానికి సమయం పట్టింది అని తెలిపారు. ఇలా మేం పిల్లల గురించి ప్లాన్ చేయకుండానే మాకు పిల్లలు అయ్యే ఛాన్స్ వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల అవకాశం కోల్పోయాము. అయితే ఇకపై త్వరలోనే పిల్లలను ప్లాన్ చేయబోతున్నామని కూడా ఈమె తెలిపారు.  ఇక తనకు పిల్లలు ఎప్పుడు కావాలి అనుకున్నాము అనే విషయాల గురించి కూడా ఈమె మాట్లాడుతూ చిన్నప్పటినుంచి మా అమ్మ సింగిల్ పేరంట్ నన్ను నా చెల్లిని చాలా ఇబ్బందులు పడుతూ పెంచిందని తెలిపారు. అలాంటి ఇబ్బందులు నా పిల్లలు పడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకే లైఫ్ లో కాస్త సెటిల్ అయిన తర్వాత పిల్లలని ప్లాన్ చేయాలనుకుంటున్నామని అది కూడా తొందర్లోనే తీరబోతోంది అంటూ వితికా ఈ సందర్భంగా పిల్లల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>