Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashwinc342502a-e1b5-463b-95e0-ff1dacbb05ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashwinc342502a-e1b5-463b-95e0-ff1dacbb05ed-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో భారత జట్టుకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్ గా కొనసాగుతున్న ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది టీమ్ ఇండియా. ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం భారత జట్టుకు ఎంతో కీలకం. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ముందుకు దూసుకుపోవాలి అంటే ఇక ఇంగ్లాండ్ ఫై విజయం సాధించి అత్యధిక పాయింట్లు సాధించాల్సిన అవసరం టీమిండియా కు ఉంది. ఈ క్రమంలోనే పక్క ప్రణాళికలతో బరిలోకి దిగుతున్న టీమ్ ఇండియాకు వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ ఉండడంతో ఎదురు దెబ్బలు Ashwin{#}Rajkot;VIRAT KOHLI;Rohit Sharma;England;Yevaruఅశ్విన్ ఇంటికి వెళ్తా అనగానే.. మేం ఒకటే అనుకున్నాం : రోహిత్అశ్విన్ ఇంటికి వెళ్తా అనగానే.. మేం ఒకటే అనుకున్నాం : రోహిత్Ashwin{#}Rajkot;VIRAT KOHLI;Rohit Sharma;England;YevaruTue, 20 Feb 2024 10:30:00 GMTఇటీవల కాలంలో భారత జట్టుకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్ గా కొనసాగుతున్న ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది టీమ్ ఇండియా. ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం భారత జట్టుకు ఎంతో కీలకం. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ముందుకు దూసుకుపోవాలి అంటే ఇక ఇంగ్లాండ్ ఫై విజయం సాధించి అత్యధిక పాయింట్లు సాధించాల్సిన అవసరం టీమిండియా కు ఉంది. ఈ క్రమంలోనే పక్క ప్రణాళికలతో బరిలోకి దిగుతున్న టీమ్ ఇండియాకు వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ ఉండడంతో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీనికి తోడు అటు కొంతమంది ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో కూడా జట్టుకు దూరమవుతున్నారు.


 ఇప్పటికే విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ ఏకంగా టెస్ట్ సిరీస్ మొత్తానికి కూడా వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల జట్టులో కీలక స్పిన్నర్ గా వ్యవహరిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ సైతం వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం కావడంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. భారత జట్టు బౌలింగ్ విభాగాన్ని తన స్పిన్ బౌలింగ్ తో ముందుకు నడిపిస్తున్న అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడు లేకపోతే టీమిండియా కు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లను ఎదుర్కోవడం కష్టమే అని ఎంతో మంది విశ్లేషకులు కూడా అభిప్రాయం చేశారు. ఇలా వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిపోయిన అశ్విన్ మళ్ళీ జట్టులో చేరాడు.


 ఈ క్రమంలోనే రవిచంద్రన్ అశ్విన్ తల్లికి అనారోగ్యం ఉండడంతో రాజ్కోట్ టెస్ట్ మధ్యలోనే ఆయన చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో జట్టులో ఏం జరిగిందో.. కెప్టెన్ రోహిత్ వెల్లడించారు. ఇక అశ్విన్ గురించి ఈ విషయం తెలియగానే.. మా మనసులో వేరే ఆలోచన ఏమీ లేదు. కుటుంబం కంటే ఎవరు ఎక్కువ కాదు.. వెంటనే బయలుదేరమని చెప్పాము. అయితే అతను ఇంటికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి జట్టులో పాల్గొన్నారు. ఆటపట్ల అతని అంకితభావానికి ఇది నిదర్శనం అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>