Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dj-tillub7d4df47-2dd7-440d-b90a-ae5a27409db4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dj-tillub7d4df47-2dd7-440d-b90a-ae5a27409db4-415x250-IndiaHerald.jpgసిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది టిల్లు స్క్వేర్. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. మార్చ్ 29వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులందరిలో ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఇక మరోసారి అటు సినీ ప్రేక్షకులందరికీ ఈ సినిమా అద్భుతంగా ఎంటర్టైన్ చేయడం ఖాయమని సిని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు పెరిDj tillu{#}siddhu;Hollywood;Duvvada Jagannadham;local language;Telugu;Yevaru;Tollywood;Cinemaసిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' కి.. గాడ్జిల్లా గండం?సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' కి.. గాడ్జిల్లా గండం?Dj tillu{#}siddhu;Hollywood;Duvvada Jagannadham;local language;Telugu;Yevaru;Tollywood;CinemaSun, 18 Feb 2024 09:15:00 GMTసిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది టిల్లు స్క్వేర్. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. మార్చ్ 29వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులందరిలో ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఇక మరోసారి అటు సినీ ప్రేక్షకులందరికీ ఈ సినిమా అద్భుతంగా ఎంటర్టైన్ చేయడం ఖాయమని సిని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు పెరిగిపోవడంతో ఇక ఈ సినిమాకు అన్ని ఏరియా లో నుంచి కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది.



 అయితే ఇక ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమాకి ఏకంగా గాడ్జిల్లాతో గండం ఉంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇక టిల్లు స్క్వేర్ విడుదలవుతున్న మార్చ్ 29వ తేదీనే అటు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్.. ది న్యూ ఎంపైర్ అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అదేంటి లోకల్ సినిమా విడుదలవుతుంటే అదేదో హాలీవుడ్ సినిమాను ఎవరు పట్టించుకుంటారు అని కొట్టి పారేస్తే మాత్రం పొరపాటే. ఎందుకంటే గాడ్జిల్లా కాంగ్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్న పిల్లలే కాదు యూత్ కూడా ఎగబడి మరి ఈ సినిమాలను చూస్తూ ఉంటారు.


 ఇక ఇతర దేశాల్లో ఈ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాకు టాలీవుడ్ లో వసూళ్ల విషయంలో డోకా లేకపోయినా ఓవర్సీస్ లో మాత్రం అసలు సమస్య వచ్చే అవకాశం ఉంది. గత రెండేళ్ల క్రితం విడుదలైన డిజే టిల్లు సినిమాకి  యుఎస్ లో భారీ స్పందన దక్కింది. రెండు కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఇప్పుడూ గాడ్జిల్లా కాంగ్ సినిమా వల్ల అటు తగినన్ని థియేటర్లు దొరికే అవకాశం కూడా తక్కువే. ఈ క్రమంలోనే  మేకర్స్ తెలివిగా ముందుగానే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కెరియర్ లో ఎప్పుడూ చేయలేనంత రీతిలో గ్లామర్ షో చేసింది. దీంతో ఆకోణంలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. మరి గాడ్జిల్లా కాంగ్ లాంటి ఒక హాలీవుడ్ సినిమాతో పోటీపడి టిల్లు స్క్వేర్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>