Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle57485b39-0d4f-4082-9aa9-05bd17b2f39c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle57485b39-0d4f-4082-9aa9-05bd17b2f39c-415x250-IndiaHerald.jpgరవితేజ నటించిన ఈగల్‌ మూవీ థియేటర్లో రన్‌ అవుతుంది. ఈ మూవీ ఇటీవల డీలా పడిపోయింది. అయితే ఈ సినిమా ద్వారా నిర్మాతలకు మాత్రం భారీగా నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది. మాస్‌ మహారాజా రవితేజ నటించిన ఈగల్‌ మూవీ థియేటర్లో పురిటి నొప్పులను అనుభవిస్తుంది. ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ కాలేదు. వీకెండ్‌లో తప్పితే వీక్‌ డేస్‌లో ఈ మూవీ డీలా పడిపోయింది. తొలి వారంలో బ్రేక్‌ ఈవెన్‌ కి దగ్గరగా వెళ్లింది. కానీ బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే పరిస్థితి కావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా సేఫ్‌లోకి వెళ్లడం చాలా కష్టంగానే కనిపిస్తsocialstars lifestyle{#}Kavuru Srinivas;Valentines Day;Audio;Ravi;ravi teja;media;Industry;Hero;Cinema'ఈగల్ ' విషయంలో వెనక్కి తగ్గుతున్న ఓటీటీ సంస్థలు....!!'ఈగల్ ' విషయంలో వెనక్కి తగ్గుతున్న ఓటీటీ సంస్థలు....!!socialstars lifestyle{#}Kavuru Srinivas;Valentines Day;Audio;Ravi;ravi teja;media;Industry;Hero;CinemaSun, 18 Feb 2024 12:00:49 GMTరవితేజ నటించిన ఈగల్‌ మూవీ థియేటర్లో రన్‌ అవుతుంది. ఈ మూవీ ఇటీవల డీలా పడిపోయింది. అయితే ఈ సినిమా ద్వారా నిర్మాతలకు మాత్రం భారీగా నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది.
మాస్‌ మహారాజా రవితేజ నటించిన ఈగల్‌ మూవీ థియేటర్లో పురిటి నొప్పులను అనుభవిస్తుంది. ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ కాలేదు. వీకెండ్‌లో తప్పితే వీక్‌ డేస్‌లో ఈ మూవీ డీలా పడిపోయింది. తొలి వారంలో బ్రేక్‌ ఈవెన్‌ కి దగ్గరగా వెళ్లింది. కానీ బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే పరిస్థితి కావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా సేఫ్‌లోకి వెళ్లడం చాలా కష్టంగానే కనిపిస్తుంది.బుధవారం నుంచే రీ రిలీజ్‌ సినిమాల హవా సాగుతుంది. వాలెంటైన్స్ డే సందర్బంగా చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఓయ్‌ వంటి సినిమాలు అప్పుడు కంటే ఇప్పుడే బాగా ఆడుతున్నాయి. ఇంకా ప్రదర్శించబడుతున్నాయి. దీంతో ఇది ఈగల్‌ సినిమాపై ప్రభావం పడింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయ్యింది. ఈగల్‌ మూవీ థియేట్రికల్‌గా సేఫ్‌ అవుతుందా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే రవితేజ నటించిన ఈగల్‌ మూవీ కారణంగా నిర్మాతలు మాత్రం భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తిందట. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీగా నిర్మించింది. సుమరు 70కోట్ల వరకు బడ్జెట్‌ అయ్యిందని తెలుస్తుంది. ఇందులో రవితేజకే 25-30కోట్ల వరకు పారితోషికంగా ముట్టిందట. ఇతర ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ అన్ని కలపి నలభై కోట్లు తాటిందని, సినిమా మేకింగ్‌కి మరో ముప్పై కోట్ల వరకు అయ్యిందని సమాచారం.

 70కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌ కేవలం 22కోట్లు మాత్రమే. ఆడియో వంటి ఇతర రైట్స్ పరంగా దాదాపు ముప్పై దాకా నిర్మాతలకు వచ్చిందట. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీ కాలేదు. సినిమాని కొనేందుకు ఏ ఓటీటీ సంస్థ ముందుకు రావడం లేదు. కొన్ని వచ్చినా, నిర్మాతలు చెప్పే ప్రైజ్‌ చూసి వెనక్కి తగ్గినట్టు సమాచారం. దీంతో ఇప్పటి వరకు ఈగల్‌ ఓటీటీ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. దీనికితోడు రవితేజ సినిమాలకు ఓటీటీలో పెద్దగా ఆదరణ లేకపోవడం కూడా ఓ కారణం అని తెలుస్తుంది.ఇలా చూస్తే ఈ సినిమాకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా నలభై కోట్ల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఓ పెద్ద స్టార్‌ హీరో సినిమాకి ఈ రేంజ్‌ నష్టం వాటిళ్లడం గమనార్హం. `ఈగల్‌`కి యావరేజ్‌ టాక్‌ వచ్చినా థియేట్రికల్‌గా సత్తా చాటలేకపోవడం, మరోవైపు ఓటీటీ సంస్థలు డేర్‌ చేయకపోవడం నిర్మాతల కొంపు ముంచుతుంది. మామూలుగా అయితే థియేట్రికల్‌గా నష్టం వచ్చినా, ఓటీటీ రైట్స్ ద్వారా కొంత సేఫ్‌ అయ్యేవాళ్లు నిర్మాతలు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. పెద్ద హీరో సినిమాలను కూడా ఓటీటీ సంస్థలు కొనేందుకు ముందుకు రాకపోవడం విచారకరం. ఇది ఇండస్ట్రీకే పెద్ద దెబ్బగా మారుతుందని చెప్పొచ్చు.రవితేజ హీరోగా రూపొందిన ఈగల్‌ మూవీలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటించింది. అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్రలో నటించింది. ఆమెతోపాటు మధుబాల, శ్రీనివాస్‌ అవసరాల ముఖ్య పాత్రల్లో మెరిశారు. కార్తిక్‌ ఘట్టమనేని ఈ మూవీని రూపొందించారు. స్టయిలీష్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. కథలో విషయం లేకపోవడంతో యాక్షన్‌ నే నమ్ముకున్నాడు దర్శకుడు. సెకండాఫ్‌లో యాక్షన్‌ సీక్వెన్స్ అదిరిపోయాయి. కానీ కథ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. ఫస్టాఫ్‌లో ఎలివేషన్లు తగ్గించి కథపై ఫోకస్‌ పెడితే సినిమా పెద్ద రేంజ హిట్‌ అయ్యేది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>