PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyandfa88435-9fd3-41d0-8dd4-043486105db9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyandfa88435-9fd3-41d0-8dd4-043486105db9-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌పై గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్‌ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కేసు రిజిస్టర్ చేసింది.ఇంకా అంతేకాకుండా ఈ కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేయడంతోపాటు.. మార్చి 25న గుంటూరుPawan Kalyan{#}pawan kumar;Uttarandhra;Thadikonda;central government;TDP;Janasena;Andhra Pradesh;Dookudu;CBN;Guntur;kalyan;Pawan Kalyan;court;March;police;YCP;News;District;Elections;CMఎన్నికల వేళ చిక్కుల్లో పవర్ స్టార్?ఎన్నికల వేళ చిక్కుల్లో పవర్ స్టార్?Pawan Kalyan{#}pawan kumar;Uttarandhra;Thadikonda;central government;TDP;Janasena;Andhra Pradesh;Dookudu;CBN;Guntur;kalyan;Pawan Kalyan;court;March;police;YCP;News;District;Elections;CMSun, 18 Feb 2024 17:50:50 GMTజనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌పై గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్‌ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కేసు రిజిస్టర్ చేసింది.ఇంకా అంతేకాకుండా ఈ కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేయడంతోపాటు.. మార్చి 25న గుంటూరు జిల్లా కోర్ట్‌కు హాజరు కావాలని కూడా నోటీస్‌లు ఇచ్చింది. జులై 3 వ తేదీన ఏలూరులో వారాహి యాత్రలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. వాలంటీర్లపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యం వెనుక వాలెంటీర్ వ్యవస్థ ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు కేసులో పేర్కొన్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో సుమారు 29వేల నుంచి 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ పేర్కొన్నారు.


వారిలో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలినవారి గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదంటూ కామెంట్ చేశారు.. దీనిపై అప్పట్లోనే వాలంటీర్లతోపాటు.. వైసీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే తాజాగా కేసు రిజిస్టర్ చేయడం పెద్ద సంచలనంగా మారింది.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ దూకుడు పెంచారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తలతో పవన్‌ కళ్యాణ్ భేటీ కానున్నారు. వన్‌ టూ వన్‌ చర్చిస్తారని సమాచారం తెలుస్తుంది. ఆశావహులు, పొత్తులో పోటీ చేసే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలతో పాటు ఎన్నికల కార్యాచరణను నేతలతో చర్చిస్తారు పవన్ కళ్యాణ్.. ఇప్పటికే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సీట్ల విషయంపై పవన్ కల్యాణ్ చర్చించారు.. ఆ దిశగా.. పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో భేటీ కానున్న పవన్ కల్యాణ్.. పోటీ చేసే సీట్లపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>