PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-jansenac672cd0a-ae12-43ff-ba5b-661f1df3ffed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp-jansenac672cd0a-ae12-43ff-ba5b-661f1df3ffed-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలలో ఇటీవలే పర్యటన చేయవలసి ఉండగా కొన్ని కారణాల చేత రద్దయింది. ముఖ్యంగా భీమవరంలో నియోజకవర్గంలోని రెండు ఇన్చార్జీలు నాయకులతో భేటీ కావాల్సి ఉండగా.. అందుకు తగ్గట్టుగా పార్టీ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంజనీరింగ్ కళాశాలలో హెలిప్యాడ్ లో దిగాల్సి ఉండగా ఇందుకు యాజమాన్యం అనుమతి తీసుకున్నప్పటికీ కానీ అక్కడ దిగడానికి కాస్తా అణువుగా ఉండదంటూ..R&B అధికారుల సైతం వాటిని రద్దు చేశారు. ఆ పర్యటనను సైతం పవన్ కళ్యాణ్ రద్దు చేసుకోవలసి వచ్చినది. ఆ తర్YCP;TDP;JANSENA{#}TDP;Janasena;Bharatiya Janata Party;politics;Party;CBN;YCP;Jagan;Government;kalyan;Andhra Pradeshజనసేన- టిడిపి కలిసి ఏపీ సీఎంను ఓడించగలరా..?జనసేన- టిడిపి కలిసి ఏపీ సీఎంను ఓడించగలరా..?YCP;TDP;JANSENA{#}TDP;Janasena;Bharatiya Janata Party;politics;Party;CBN;YCP;Jagan;Government;kalyan;Andhra PradeshSun, 18 Feb 2024 10:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలలో ఇటీవలే పర్యటన చేయవలసి ఉండగా కొన్ని కారణాల చేత రద్దయింది. ముఖ్యంగా భీమవరంలో నియోజకవర్గంలోని రెండు ఇన్చార్జీలు నాయకులతో భేటీ కావాల్సి ఉండగా.. అందుకు తగ్గట్టుగా పార్టీ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంజనీరింగ్ కళాశాలలో హెలిప్యాడ్ లో దిగాల్సి ఉండగా ఇందుకు యాజమాన్యం అనుమతి తీసుకున్నప్పటికీ కానీ అక్కడ దిగడానికి కాస్తా అణువుగా ఉండదంటూ..R&B అధికారుల సైతం వాటిని రద్దు చేశారు. ఆ పర్యటనను సైతం పవన్ కళ్యాణ్ రద్దు చేసుకోవలసి వచ్చినది.

ఆ తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వం దురుద్దేశంతోనే ఇలా పర్యటనను అనుమతించలేదంటూ అటు టిడిపి నాయకులు జనసేన నాయకులు మండిపడ్డారు. దీంతో పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీసులో పలు రకాల నేతలతో మంగళగిరిలో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎప్పుడు చాలా ఆసక్తికరంగా కనిపిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలు ఎక్కువగా కులాలపైనే ఆధారపడి ఉంటాయని కూడా చెప్పవచ్చు మిగిలిన ఏ రాష్ట్రాలలో లేనివిధంగా ఇక్కడ రాజకీయాలు ఉంటాయి. అధికారంలోకి వచ్చేందుకు ఎంతోమంది నాయకులు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు.

 ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని అటు తెలుగుదేశం, జనసేన పార్టీ, బిజెపి పార్టీ ఏకమై ఓడించాలంటూ ఎన్నో పథకాలు వేస్తున్నారు.. గతంలో వైసిపి టిడిపి జనసేన ఒంటరిగా పోటీ చేసిన స్థానాలలో వైసిపి పార్టీ ఏకంగా 151 సీట్లతో 50 శాతం ఓట్లతో వైసిపి భారీ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. టిడిపి పార్టీ అయితే ఏకంగా భూస్థాపితమే అయ్యిందని కూడా పలువురు రాజకీయ నాయకులు తెలియజేస్తూ ఉన్నారు. దీంతో జాగ్రత్త పడిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లి జగన్ ఓడించాలని ఉద్దేశంతోనే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రోజు సిద్ధం సభలో చెప్పేటువంటి మేనిఫెస్టో వల్ల కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామంటూ వైసీపీ నాయకులు ధీమాతో ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>