Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood204e085b-5774-49ad-891e-e2bd2be55e75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood204e085b-5774-49ad-891e-e2bd2be55e75-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఉన్న టాప్ నటుల్లో నవాజుద్దీన్ సిద్ధికి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. టాప్ అనగానే రెమ్యూనరేషన్ లోనో.. లేదా స్టార్డం సంపాదించడంలోనూ అనుకునేరు. ఏకంగా నటనలో అందరికంటే టాప్ లో ఉన్నారు ఆయన. ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ నటనతో అదరగొడుతూ ఉంటాడు. అయితే ఇక మొన్నటికి మొన్న వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాడు నవాజుద్దీన్ సిద్ధికి. Kollywood{#}Rajani kanth;Petta;Venkatesh;Tamil;bollywood;Hero;Tollywoodరజనీకాంత్ సినిమాలో నటించి.. ఎంతో గిల్టీగా ఫీలయ్యా : బాలీవుడ్ స్టార్రజనీకాంత్ సినిమాలో నటించి.. ఎంతో గిల్టీగా ఫీలయ్యా : బాలీవుడ్ స్టార్Kollywood{#}Rajani kanth;Petta;Venkatesh;Tamil;bollywood;Hero;TollywoodSun, 18 Feb 2024 08:30:00 GMTబాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఉన్న టాప్ నటుల్లో నవాజుద్దీన్ సిద్ధికి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. టాప్ అనగానే రెమ్యూనరేషన్ లోనో.. లేదా స్టార్డం సంపాదించడంలోనూ అనుకునేరు. ఏకంగా నటనలో అందరికంటే టాప్ లో ఉన్నారు ఆయన. ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ నటనతో అదరగొడుతూ ఉంటాడు. అయితే ఇక మొన్నటికి మొన్న వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాడు నవాజుద్దీన్ సిద్ధికి.


 అయితే ఇక ఆయన నటించిన ఈ రెండు సినిమాలు ఎందుకో పెద్దగా ప్రేక్షకాదరణకు మాత్రం నోచుకోలేకపోయాయి అని చెప్పాలి. కాగా ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాలో ఇక తాను ఓ పాత్రలో నటించడం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ బాలీవుడ్ స్టార్. పేట సినిమాలో పెద్ద హీరో అయిన రజినీకాంత్ తో నటించటం ఆనందమే. కానీ ఈ సినిమాలో నటించినందుకు ఎంతో గిల్టీగా ఫీలయ్యాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నవాజుద్దీన్ సిద్ధికి ఇలాంటి వ్యాఖ్యలు చేసాడు. పేట సినిమా తర్వాత ఎంతో గిల్టీగా ఫీల్ అయ్యాను. షూటింగ్ వెళ్లిన వెంటనే ఎంతగానో బాధపడ్డాను


 ఎందుకంటే అక్కడున్న వారందరిని కూడా నేను ఫూల్స్ ని చేస్తున్నానా అని నాకు అనిపించింది. ఎందుకంటే కేవలం డైలాగులు లిప్ సింక్ అవడం కోసం చెప్పాను. ప్రామ్టర్  సహాయంతో డైలాగులు చెప్పాను. చాలా పదాలకు అర్థం కూడా తెలియకుండానే యాక్టింగ్ చేశాను. అయితే డైలాగులు బాగా చెప్పినప్పటికీ ఎందుకు ఏదో ఒక ఫీలింగ్ ఉండేది. నేనేమైనా ఫ్రాడ్ చేస్తున్నానా అని నన్ను నేను కూడా ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను అంటూ నవాజుద్దీన్ సిద్ధికి చెప్పుకొచ్చాడు. అయితే వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ మూవీలో మాత్రం ఈ ఫీలింగ్ రాకుండా చూసుకూన్నా. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాను. సైంధవ్ సమయంలో అంతగా ఇబ్బంది అనిపించలేదు అంటూ నవాజుద్దీన్ సిద్ధికి చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>