MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rukhmini-vasanth89a66f72-b4fd-4ac8-8b80-49a90ee93b03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rukhmini-vasanth89a66f72-b4fd-4ac8-8b80-49a90ee93b03-415x250-IndiaHerald.jpgసౌత్ సినిమా ఇండస్ట్రీలో కన్నడ హాట్ బ్యూటీలు రష్మిక మందన్న, పూజా హెగ్డే, కృతి శెట్టి ఎంత పాపులర్ అయ్యారో మనకు తెలిసిందే. పూజ, కృతి వరుస ఫ్లాపులు మూటగట్టుకుంటున్నా రష్మిక మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది.వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. ఇటీవలే యానిమల్ మూవీతో అలరించిన ఈ బ్యూటీ..ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తోంది.ఇప్పుడు అదే కోవలోకి మరో కన్నడ బ్యూటీ రాబోతోంది. తెలుగు, తమిళ చిత్రసీమల్లో అవకాశాలు అందుకుంటోంది. ఆమె ఎవరో కాదు.. రుక్మిణీ వసంత్. సప్త సాగరRukhmini Vasanth{#}Shiva;lord siva;A R Murugadoss;Rakshit Shetty;Kollywood;Kannada;Mass;Ravi;ravi teja;Heroine;vijay deverakonda;Blockbuster hit;Pooja Hegde;advertisement;rashmika mandanna;Tamil;Hero;Telugu;Cinemaరుక్మిణీ వసంత్: నెక్స్ట్ ఈమదే హవా?రుక్మిణీ వసంత్: నెక్స్ట్ ఈమదే హవా?Rukhmini Vasanth{#}Shiva;lord siva;A R Murugadoss;Rakshit Shetty;Kollywood;Kannada;Mass;Ravi;ravi teja;Heroine;vijay deverakonda;Blockbuster hit;Pooja Hegde;advertisement;rashmika mandanna;Tamil;Hero;Telugu;CinemaSun, 18 Feb 2024 18:12:42 GMTసౌత్ సినిమా ఇండస్ట్రీలో కన్నడ హాట్ బ్యూటీలు రష్మిక మందన్న, పూజా హెగ్డే, కృతి శెట్టి ఎంత పాపులర్ అయ్యారో మనకు తెలిసిందే. పూజ, కృతి వరుస ఫ్లాపులు మూటగట్టుకుంటున్నా రష్మిక మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది.వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. ఇటీవలే యానిమల్ మూవీతో అలరించిన ఈ బ్యూటీ..ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తోంది.ఇప్పుడు అదే కోవలోకి మరో కన్నడ బ్యూటీ రాబోతోంది. తెలుగు, తమిళ చిత్రసీమల్లో  అవకాశాలు అందుకుంటోంది. ఆమె ఎవరో కాదు.. రుక్మిణీ వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. తెలుగులో కూడా ఈ మూవీ రిలీజైంది. సైడ్-ఏ, సైడ్-బి అంటూ రెండు భాగాలుగా వచ్చి తెలుగులో ఈ మూవీ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది.అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యాక రుక్మిణిని చాలా మంది మేకర్స్ సంప్రదించారట. కానీ సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యే దాకా ఆమె ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ రెండు చిత్రాల్లో రుక్మిణి నటన, లుక్స్ కు చాలా మంచి మార్కులు పడ్డాయి. ఇక సెకెండ్ పార్ట్ రిలీజ్ అయ్యాక ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.


ఇప్పుడు తమిళం, తెలుగు భాషల దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల్లో రుక్మిణి వసంత్ అవకాశాలు దక్కించుకుంటోంది.తమిళంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి తరువాత చిత్రానికి సంతకం చేసింది రుక్మిణీ వసంత్.అలాగే స్టార్ డైరెక్టెర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ హాట్ బ్యూటీ.అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ పేరు పరిశీలించినట్టు వార్తలొస్తున్నాయి. ఆ తర్వాత మాస్ రాజా రవితేజ మూవీ విషయంలో కూడా ఈమె పేరే వినిపించింది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక రష్మిక లాగే రుక్మిణి కూడా పాపులర్ అవుతుందని ఇప్పుడు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఇక రష్మికను కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేసిన రక్షిత్ శెట్టి సినిమాతోనే, ఈమె కూడా తెలుగులో పాపులర్ అవ్వడం విశేషం. మరి సౌత్ లో రుక్మిణి వసంత్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>