PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan-bjp27615091-373f-4cfe-9484-22fc8d98e4a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan-bjp27615091-373f-4cfe-9484-22fc8d98e4a1-415x250-IndiaHerald.jpgఅందుకనే వీళ్ళంతా గగ్గోలు పెట్టేస్తున్నారు. దాంతో వీళ్ళకి ఎలా సర్దిచెప్పాలో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో జనసేనలో మరో గోల పెరిగిపోతోంది. అదేమిటంటే మొదటినుండి పార్టీ జెండా మోసిన వాళ్ళకి బ్యానర్లు కట్టిన వాళ్ళు ఇపుడు ఎక్కడో ఉండిపోయారట. వైసీపీ నుండి వచ్చిన వాళ్ళకి, కొంతకాలం గ్యాప్ తర్వాత ఇపుడు యాక్టివ్ అవుతున్న వాళ్ళకే పవన్ ప్రాధాన్యత ఇస్తున్నారట. chandrababu pawan bjp{#}srinivas;Bonda;Amith Shah;Janasena;devineni avinash;Vishakapatnam;TDP;YCP;News;Bharatiya Janata Party;Partyఅమరావతి : అవస్తలు పడుతున్నారా ?అమరావతి : అవస్తలు పడుతున్నారా ?chandrababu pawan bjp{#}srinivas;Bonda;Amith Shah;Janasena;devineni avinash;Vishakapatnam;TDP;YCP;News;Bharatiya Janata Party;PartySun, 18 Feb 2024 03:00:00 GMT


ఏ ముహూర్తాన చంద్రబాబునాయుడు బీజేపీ అగ్రనేత అమిత్ షా తో చర్చలు జరిపారో అప్పటినుండో సమస్యలు పెరిగిపోతున్నాయి. టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఉండుంటే ఈపాటికి సీట్ల సంఖ్యతో పాటు నియోజకవర్గాలు కూడా ఫైనల్ అయిపోయుండేవే. జనసేన పోటీచేయబోయే నియోజకవర్గాలను ఎలాగూ చంద్రబాబే డిసైడ్ చేస్తారు కాబట్టి పవన్ తో ఎలాంటి పేచి ఉండేదికాదు. కాని ఎప్పుడైతే మధ్యలో బీజేపీ కూడా దూరిందో సీనంతా మారిపోయింది.





జనసేనతో పొత్తునే వ్యతిరేకిస్తున్న తమ్ముళ్ళు మధ్యలో బీజేపీ కూడా చేరటాన్ని తట్టుకోలేకపోతున్నారు. జనసేనతో పొత్తంటే తక్కువల తక్కువ 25 అసెంబ్లీలను టీడీపీ వదులుకోవాలి. దాంతో సీనియర్లకు టికెట్లు ఎగిరిపోతాయి. ఇపుడు బీజేపీ కూడా జతకట్టే సూచనలు కనబడుతుండటంతో చాలామంది సీనియర్లకు పోటీచేసే అవకాశాలు ఎగిరిపోతున్నాయి. పార్టీవర్గాల సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ 20 మందికి పైగా సూపర్ సీనియర్లకు పోటీచేసే అవకాశాలు ఉండవట. దేవినేని ఉమ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ, మండలి బుద్ధప్రసాద్, బోడె ప్రసాద్, ఎన్వీఎస్ వర్మ, బొడ్డు వెంకటరమణ లాంటి అనేకమంది సీనియర్లకు టికెట్లు గల్లంతవబోతున్నాయట.





అందుకనే వీళ్ళంతా గగ్గోలు పెట్టేస్తున్నారు. దాంతో వీళ్ళకి ఎలా సర్దిచెప్పాలో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో జనసేనలో మరో గోల పెరిగిపోతోంది. అదేమిటంటే మొదటినుండి పార్టీ జెండా మోసిన వాళ్ళకి బ్యానర్లు కట్టిన వాళ్ళు ఇపుడు ఎక్కడో ఉండిపోయారట.  వైసీపీ నుండి వచ్చిన వాళ్ళకి, కొంతకాలం గ్యాప్ తర్వాత ఇపుడు యాక్టివ్ అవుతున్న వాళ్ళకే పవన్ ప్రాధాన్యత  ఇస్తున్నారట.





పవన్ వైఖరి కారణంగా చాలామంది సీనియర్లకు మండిపోతోందట. విశాఖపట్నం జిల్లాలో శివశంకర్ లాంటి వాళ్ళే దీనికి ఉదాహరణ. వైసీపీ నుండి నేరుగా చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళకి, టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్ళి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ లాంటి నేతలకే ఇపుడు బాగా ఇంపార్టెన్స్ ఉంటోందని పార్టీలో గోల పెరిగిపోతోంది. అందుకనే రెండుపార్టీల్లో పెరిగిపోతున్న గోలను సర్దుబాటు చేయలేక చంద్రబాబు, పవన్ నానా అవస్తలు పడుతున్నారట.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>