PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/will-rajadhani-files-on-amaravati-a-gain-for-tdp5594ebbb-7a78-4ae7-b808-946b3b7b894a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/will-rajadhani-files-on-amaravati-a-gain-for-tdp5594ebbb-7a78-4ae7-b808-946b3b7b894a-415x250-IndiaHerald.jpgఎందుకు ఈమాట చెప్పాల్సొచ్చిందంటే సినిమా రిలీజైన రోజు నుండి ఏ షో తీసుకున్నా పట్టుమని పదిమంది కూడా కనబడటంలేదనే టాక్ పెరిగిపోతోంది. రాజధాని రైతులు అంటే కేవలం అమరావతిలోని 29 గ్రామాల పరిధిలోనే ఉన్నారు. మరి వీళ్ళకి మద్దతుగా నిలిచిన జనాలు 25 జిల్లాల్లోను ఉన్నారు కదా. మద్దతు జనాలే కాకుండా డైరెక్టుగా టీడీపీ జనాలు, మిత్రపక్షం జనసేన జనాలు, సానుభూతిపరులు చాలామంది ఉంటారు కదా. మరి వీళ్ళు కూడా ఈ సినిమాను చూడటంలేదంటే ఏమిటర్ధం ? amaravati chandrababu jagan{#}Amaravati;Capital;TDP;CBN;Jagan;Janasena;Cinemaఅమరావతి : సినిమానే టీడీపీని గెలిపిస్తుందా ?అమరావతి : సినిమానే టీడీపీని గెలిపిస్తుందా ?amaravati chandrababu jagan{#}Amaravati;Capital;TDP;CBN;Jagan;Janasena;CinemaSun, 18 Feb 2024 09:00:00 GMT


రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఎంతటి భ్రమల్లో బతుకుతున్నారో అర్ధమైపోతోంది. ఈమధ్యనే వచ్చిన రాజధాని ఫైల్స్ అనే ఒక పిచ్చిసినిమాను పట్టుకుని జనాలందరు సినిమాను చూడండి, చూసి తరించండని ట్విట్టర్లో పెద్ద పిలుపిచ్చారు. సినిమాలో దమ్ముంటే జనాలు వాళ్ళంతట వాళ్ళే చూస్తారు. పనిగట్టుకుని చంద్రబాబో లేకపోతే తమ్ముళ్ళో ప్రమోట్ చేయాల్సిన అవసరంలేదు. ఇపుడు రాజధాని ఫైల్స్ అనే సినిమా ఎంతటి ఫ్లాప్ అంటే అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, వాళ్ళ కుటుంబాలు కూడా చూడటంలేదు.





ఎందుకు ఈమాట చెప్పాల్సొచ్చిందంటే సినిమా రిలీజైన రోజు నుండి ఏ షో తీసుకున్నా పట్టుమని పదిమంది కూడా కనబడటంలేదనే టాక్ పెరిగిపోతోంది. రాజధాని రైతులు అంటే కేవలం అమరావతిలోని 29 గ్రామాల పరిధిలోనే ఉన్నారు. మరి వీళ్ళకి మద్దతుగా నిలిచిన జనాలు 25 జిల్లాల్లోను ఉన్నారు కదా. మద్దతు జనాలే కాకుండా డైరెక్టుగా టీడీపీ జనాలు, మిత్రపక్షం జనసేన జనాలు, సానుభూతిపరులు చాలామంది ఉంటారు కదా. మరి వీళ్ళు కూడా ఈ సినిమాను చూడటంలేదంటే ఏమిటర్ధం ?





అందులోని కంటెంట్ అంతా ఉత్త సొల్లనే కదా. అసలు సినిమా తీయటమే జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చూపటం కోసమే తీసినట్లు అందరికీ తెలుసు. అలాంటిది సినిమాను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుంటే పర్వాలేదన్నట్లుగా అయినా ఉండేది. సినిమాలో రాజధాని కోసం భూములిచ్చిన వాళ్ళది  ఫక్తు వ్యాపారమైతే అదేదో త్యాగంగా చూపించటమే విచిత్రం.





మామూలుగానే రాజధాని రైతుల నుండి మిగిలిన జిల్లాల్లోని జనాలకు ఎలాంటి  మద్దతు దొరకలేదు. అలాంటిది ఇపుడు సినిమా చూస్తే జనాలందరు విరగబడి చూసేస్తారని నిర్మాతలు ఎలాగఅనుకున్నారు ? పైగా రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ కు సినిమా మొదలవుతోందని చంద్రబాబు పెద్ద వార్నింగొకటి. అంటే ఈ సినిమా చూసిన జనాలు జగన్ కు వ్యతిరేకమైపోయి పోలోమంటు టీడీపీకి ఓట్లేసి గెలిపించేస్తారనే పిచ్చిభ్రమల్లో ఉన్నట్లు అర్ధమైపోతోంది. ఇందుకనే చంద్రబాబు ఎంతటి భ్రమల్లో ఉన్నారో అని అన్నది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>