Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled27b201a-93f6-4c3b-b7fb-19e18bf2dd2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled27b201a-93f6-4c3b-b7fb-19e18bf2dd2e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్‌, గాడ్‌ ఫాదర్‌అండ లేకుండా స్టార్‌ హీరోగా ఎదిగిన వాళ్లలో విజయ్‌ కూడా ఒకరు.దీనికి తోడు విజయ్ ఆటిట్యూడ్‌ను కూడా చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిల్లోనూ ఈ రౌడీ హీరోకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే బెంగళూరుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు విజయ్ దేవరకొండపై చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. బెంగళూరులో చదువుకుంటున్న హర్షిత రెడ్డి అనే సస్టూడెంట్‌ తన ఫ్రెండ్‌తో కలsocialstars lifestyle{#}BEAUTY;parasuram;vijay deverakonda;Hero;Heroine;Joseph Vijay;April;Sri Venkateshwara Creations;Reddy;Dil;Devarakondaఆ ఇద్దరికీ క్యూట్‌గా రిప్లై ఇచ్చిన రౌడీ హీరో విజయ్....!!ఆ ఇద్దరికీ క్యూట్‌గా రిప్లై ఇచ్చిన రౌడీ హీరో విజయ్....!!socialstars lifestyle{#}BEAUTY;parasuram;vijay deverakonda;Hero;Heroine;Joseph Vijay;April;Sri Venkateshwara Creations;Reddy;Dil;DevarakondaSun, 18 Feb 2024 22:43:06 GMTటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్‌, గాడ్‌ ఫాదర్‌అండ లేకుండా స్టార్‌ హీరోగా ఎదిగిన వాళ్లలో విజయ్‌ కూడా ఒకరు.దీనికి తోడు విజయ్ ఆటిట్యూడ్‌ను కూడా చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిల్లోనూ ఈ రౌడీ హీరోకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే బెంగళూరుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు విజయ్ దేవరకొండపై చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. బెంగళూరులో చదువుకుంటున్న హర్షిత రెడ్డి అనే సస్టూడెంట్‌ తన ఫ్రెండ్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక రీల్ క్రియేట్ చేసింది. ' విజయ్ దేవరకొండ ఈ వీడియోకి కామెంట్ చేస్తే తాము పరీక్షలకు ప్రిపేర్ అవుతాం' అంటూ ఈ వీడియో ఉంది. షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో నెట్టింట బాగా వైరలైంది. చివరకు విజయ్‌ దేవరకొండ దాకా వెళ్లింది వీడియో. దీనిని చూసిన హీరో వెంటనే స్పందించాడు. ' 90 శాతం మార్కులు తెచ్చుకో.. కచ్చితంగా నేను నిన్ను కలుస్తాను' అంటూ క్యూట్‌గా రిప్లై ఇచ్చాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థినుల ఆనందానికి హద్దుల్లేకుండాపోయింది. విద్యార్థినులు అభిమానంతో వీడియో చూసినా.. విజయ్ స్పందించిన తీరు అభిమానులను ఇంప్రెస్‌ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది
ఇక ల విషయానికొస్తే.. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే లో నటిస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. సీతారామం, హాయ్ నాన్నల బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, గ్లింప్స్‌, సాంగ్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్‌ 5న థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>