Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral694e778c-0771-4a9c-a014-ea788fd18c83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral694e778c-0771-4a9c-a014-ea788fd18c83-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇంగ్లాండ్ టీమిండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ హోరాహోరీగా జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది కూడా అంచనా వేయడం కష్టంగా మారిపోయింది. ప్రస్తుతం రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో కదం తొక్కారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా మంచి స్కోరు చేయగలిగింది. అయితే ఇక ఇప్పుడు భారీ టారViral{#}Ben Stokes;Audi;Ravindra Jadeja;raj;Yuva;England;Yevaruఇలా కూడా సిక్స్ కొడతారా.. వీడియో వైరల్?ఇలా కూడా సిక్స్ కొడతారా.. వీడియో వైరల్?Viral{#}Ben Stokes;Audi;Ravindra Jadeja;raj;Yuva;England;YevaruSat, 17 Feb 2024 15:00:00 GMTప్రస్తుతం ఇంగ్లాండ్ టీమిండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ హోరాహోరీగా జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది కూడా అంచనా వేయడం కష్టంగా మారిపోయింది. ప్రస్తుతం రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో కదం తొక్కారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా మంచి స్కోరు చేయగలిగింది.


 అయితే ఇక ఇప్పుడు భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు సైతం అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు అటు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కూడా ఎంతో దూకుడుగా ఆడుతూ భారీ టార్గెట్ ను ఛేదించేలాగే కనిపించారు. కానీ మహమ్మద్ సిరాజ్ దెబ్బకి ఇక ఇంగ్లాండ్ జట్టు ఆల్ అవుట్ అయింది. అయితే ఇక ఈ మూడో టెస్ట్ మ్యాచ్ ద్వారా దృవ్ జూరేల్ అవకాశం దక్కించుకున్నాడు.  ఇక తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా అరంగేట్ర మ్యాచ్ లోనే ధ్రువ్ 46 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ సాధిస్తాడు అనుకుంటున్న సమయంలో చివరికి వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. ఇక క్రీజు లో ఉన్నంత సేపు మాత్రం మెరుపులు మెరూపించాడు.


 ఈ క్రమంలోనే అతను కొట్టిన ఒక అద్భుతమైన సిక్సర్ కు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దాటిగా ఆడుతున్న ఈ యువ ఆటగాడిని బోల్తా కొట్టించేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ మార్క్ ఉడ్ ను రంగంలోకి దింపాడు. అయితే మార్క్ ఉడ్ ఆఫ్ స్టంప్ దిశగా బౌన్సర్ విసిరాడు. ఇక దీనిని అత్యంత సమయస్ఫూర్తితో ఆడాడు దృవ్. స్లిప్స్ మీదుగా అప్పర్ కట్ షాట్ ఆడి ఏకంగా ఆ బంతిని సిక్సర్ గా మలిచాడు. అతను కొట్టిన తీరు చూస్తే ఇంత ఈజీగా కూడా సిక్సర్ కొట్టవచ్చా అని నేటిజన్స్ కు అనిపిస్తుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>