PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp--janasena--bjpd6dc3b4c-65d1-445d-9d82-39e4e63ed525-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp--janasena--bjpd6dc3b4c-65d1-445d-9d82-39e4e63ed525-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ త్యాగాలకు సిద్ధపడాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన టీడీపీ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. పొత్తులు, సీట్ల సర్దుబాట్ల కారణంగా టికెట్లు రాని నేతలకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామంటూ భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు.అలాగే మరోవైపు సిట్టింగ్‌లకు సీట్లు ఖాయమని చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. జనసేన పార్టీకి 40 సీట్లు రాబట్టాలని హరిరామజోగయ్య సూచిస్తుండగా బీజేపీ వ్యక్తే సీఎం అవుతారని విష్ణువర్ధన్‌ రెడ్డి చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లTDP - JANASENA - BJP{#}Telugu Desam Party;Gorantla Butchaiah Chowdary;choudary actor;TDP;CBN;Army;Party;Bharatiya Janata Party;Letter;YCP;Andhra Pradesh;CM;Janasena;Reddyఏపీ: ఇప్పటికీ పొత్తులపై నో క్లారిటీ?ఏపీ: ఇప్పటికీ పొత్తులపై నో క్లారిటీ?TDP - JANASENA - BJP{#}Telugu Desam Party;Gorantla Butchaiah Chowdary;choudary actor;TDP;CBN;Army;Party;Bharatiya Janata Party;Letter;YCP;Andhra Pradesh;CM;Janasena;ReddySat, 17 Feb 2024 16:28:10 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ త్యాగాలకు సిద్ధపడాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన టీడీపీ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. పొత్తులు, సీట్ల సర్దుబాట్ల కారణంగా టికెట్లు రాని నేతలకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామంటూ భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు.అలాగే మరోవైపు సిట్టింగ్‌లకు సీట్లు ఖాయమని చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. జనసేన పార్టీకి 40 సీట్లు రాబట్టాలని హరిరామజోగయ్య సూచిస్తుండగా బీజేపీ వ్యక్తే సీఎం అవుతారని విష్ణువర్ధన్‌ రెడ్డి చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే తెలుగు దేశం పార్టీ - జనసేన పార్టీ కూటమి పొత్తులకు సహకరించిన నేతలకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పొత్తుల కారణంగా టికెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దన్నారు. పార్టీని నమ్ముకున్న నేతలకు అధికారంలోకి రాగానే గుర్తింపు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.


చాలా మంది వైసీపీ నేతలు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగు దేశం పార్టీలో చేరతామంటున్నారని చంద్రబాబు నాయుడు తన టీడీపీ నేతలతో చెప్పారు. తెలుగు దేశం పార్టీకి పనికొస్తారనుకునే వాళ్లనే టీడీపీలోకి తీసుకుంటున్నామన్నారు. నేతల చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని తెలుగు దేశం పార్టీ నేతలకు సూచించారాయన.అలాగే మరోవైపు టీడీపీలో సిట్టింగ్‌లందరికీ మళ్లీ సీట్లు ఖాయమన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రెండేళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు దీనిపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారాయన.ఇక పొత్తుల్లో భాగంగా సర్దుబాట్లు అనేవి కూడా ఉంటాయన్నారు. కనీసం 40 సీట్లు జనసేన పార్టీకి రాబట్టాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య తీవ్రంగా యత్నిస్తున్నారు. తెలుగు దేశం పార్టీపై ఒత్తిడి పెంచేందుకు ఆయన ఈ విషయంలో లేఖలపై లేఖలు రాస్తున్నారు. ఇంకా నియోజకవర్గాలను కూడా ఆయన సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 20 సీట్లు ఆశిస్తున్న కమలనాథులు బీజేపీ వ్యక్తే ఏపీ సీఎం అవుతారని విష్ణువర్దన్‌ రెడ్డి జోస్యం చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ బలీయమైన పార్టీగా ఎదిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>