Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india174441c5-3ff1-4da5-b22b-c105b71a5942-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india174441c5-3ff1-4da5-b22b-c105b71a5942-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి టీమిండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు అందరూ కూడా గాయంతో టీం కి దూరమవుతున్నారు. అయితే ఇలా ఎంతోమంది ఆటగాళ్ళు గాయం బారినపడి దూరమవుతుండడంతో టీమిండియా వ్యూహాలు మొత్తం తారుమారమవుతున్నాయి. ఇలాంటి సమయంలో మరి కొంతమంది ప్లేయర్లు ఏకంగా వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమవుతూ ఉండడం కూడా మరింత ఆందోళనకరంగా మారిపోయింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు అందుబIndia{#}Shreyas Iyer;raj;VIRAT KOHLI;Kuldeep Yadav;Englandఉన్నది నలుగురు బౌలర్లే.. టీమిండియా ఏం చేస్తుందో?ఉన్నది నలుగురు బౌలర్లే.. టీమిండియా ఏం చేస్తుందో?India{#}Shreyas Iyer;raj;VIRAT KOHLI;Kuldeep Yadav;EnglandSat, 17 Feb 2024 10:22:30 GMTగత కొంతకాలం నుంచి టీమిండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు అందరూ కూడా గాయంతో టీం కి దూరమవుతున్నారు. అయితే ఇలా ఎంతోమంది ఆటగాళ్ళు గాయం బారినపడి దూరమవుతుండడంతో టీమిండియా వ్యూహాలు మొత్తం తారుమారమవుతున్నాయి. ఇలాంటి సమయంలో మరి కొంతమంది ప్లేయర్లు ఏకంగా వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమవుతూ ఉండడం కూడా మరింత ఆందోళనకరంగా మారిపోయింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదు.


 ఇక మరోవైపు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి కీలక ప్లేయర్లు గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యారు. ఇక షమి ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో జట్టుకు అందుబాటులో లేడు. అయితే ఇలాంటి సమయంలో ఇక భారత జట్టు విజయంలో తన స్పిన్ బౌలింగ్ తో కీలకపాత్ర వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇక ఇప్పుడు టీమిండియా కు దూరం కావడంతో భారత జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. అశ్విన్ గైర్హాజరితో ప్రస్తుతం రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా మిగిలిన బౌలర్లతోనే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అశ్విన్ స్థానంలో కేవలం ఫీల్డర్లను మాత్రమే టీమిండియా మోహరించుకునేందుకు అవకాశం ఉంటుంది.


 అయితే ప్రస్తుతం ఉన్న నలుగురిలో అటు కీలక ఫాస్ట్ బౌలర్ అయిన సిరాజ్ గాయంతో ఉన్నాడు. అతను ఎన్ని ఓవర్లు వేయగలడు అన్న విషయంపై కూడా ఇప్పటికి ఒక క్లారిటీ లేదు. అయితే ఎక్కువ ఓవర్లు అయితే వేసే ఛాన్స్ లేదు. కాగా ఇప్పటికే దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ దూసుకుపోతున్న ఇంగ్లాండ్ ను ఈ పిచ్ పై అశ్విన్ లేకుండా అడ్డుకోవడం భారతకు తలకు మించిన భారమే అవుతుంది అని చెప్పాలి. బుమ్రా,జడేజా కుల్దీప్ యాదవ్లే ఇక ఇప్పుడు భారత బౌలింగ్ విభాగం భారాన్ని మొత్తం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నలుగురు బౌలర్లతో టీమిండియా, ఇంగ్లాండ్ ను ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>