LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pinapill-eating-health9de86f29-8900-4a9d-bb99-847b88e53078-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pinapill-eating-health9de86f29-8900-4a9d-bb99-847b88e53078-415x250-IndiaHerald.jpgపైనాపిల్ అంటే ప్రతి ఒక్కరు లొట్టలు వేసుకొని తింటూ ఉంటారు. తెలుగులో ఈ పండుని అనాస పండు అని కూడా పిలుస్తూ ఉంటారు. పైనాపిల్ పండు రుచిగా పుల్లగా చాలా జ్యూసీగా ఉంటుంది. పైనాపిల్ దాని విభిన్నమైన రుచికి ప్రసిద్ధి అని కూడా చెప్పవచ్చు. అందుకే ప్రజలు ఈ పండుని తినడానికి చాలా ఇష్టపడతారు. పైనాపిల్ రసాన్ని తాగడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో విటమిన్ -C, విటమిన్ B-6, కాపర్ మాంగనీస్ ఫోలేట్ ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ పండు తినడం వల్ల చాలా మంచిదంటూ ఆరోగ్య నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. పైనాపిల్ తినడం PINAPILL;EATING;HEALTH{#}Vitamin C;Vitamin;Heart;Copper;Cholesterol;Newsఅనస పండు తినడం వల్ల ఉపయోగాలు ఎన్నో తెలుసా..?అనస పండు తినడం వల్ల ఉపయోగాలు ఎన్నో తెలుసా..?PINAPILL;EATING;HEALTH{#}Vitamin C;Vitamin;Heart;Copper;Cholesterol;NewsSat, 17 Feb 2024 19:05:32 GMTపైనాపిల్ అంటే ప్రతి ఒక్కరు లొట్టలు వేసుకొని తింటూ ఉంటారు. తెలుగులో ఈ పండుని అనాస పండు అని కూడా పిలుస్తూ ఉంటారు. పైనాపిల్ పండు రుచిగా పుల్లగా చాలా జ్యూసీగా ఉంటుంది. పైనాపిల్ దాని విభిన్నమైన రుచికి ప్రసిద్ధి అని కూడా చెప్పవచ్చు. అందుకే ప్రజలు ఈ పండుని తినడానికి చాలా ఇష్టపడతారు. పైనాపిల్ రసాన్ని తాగడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో విటమిన్ -C, విటమిన్ B-6, కాపర్ మాంగనీస్ ఫోలేట్ ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.


ఈ పండు తినడం వల్ల చాలా మంచిదంటూ ఆరోగ్య నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. పైనాపిల్ తినడం వల్ల జీర్ణ క్రియలో చాలా ప్రభావంతం చేస్తుంది. పైనాపిల్ లో ఉండే ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.. కడుపు సంబంధిత సమస్యల నుండి కూడా పైనాపిల్ ఉపశమనాన్ని కలిగిస్తుంది.


పైనాపిల్ మొత్తం విటమిన్ సి ఉంటుంది ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇది ఎలాంటి వ్యాధులతో అయినా పోరాడేందుకు శరీరానికి మంచి శక్తినిస్తుంది. వీటితో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

పైనాపిల్ లో ఉండే ఫైబర్ విటమిన్-C వంటి పదార్థాల వల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేలా చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు అధిక రక్తపోటు సమస్య కూడా దూరమవుతుంది.


పైనాపిల్ లో ఉండే విటమిన్ సి వల్ల యాంటీ ఆక్సిడెంట్ ల వల్ల చర్మం అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. చర్మం పైన ఉండేటువంటి మచ్చలను కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది.

ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న సమాచారం ప్రకారం అధిక రక్తపోటు మధుమేహ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ పైనాపిల్ పండుని అసలు తినకూడదని ఎందుకంటే ఇందులో చక్కెర కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఈ పండుకి దూరంగా ఉండటమే మంచిదంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>