EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu7765bbd4-3696-411b-8858-9cb7304f7275-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu7765bbd4-3696-411b-8858-9cb7304f7275-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబుది నాలుగున్నర దశాబ్దాల అనుభవం. ఆయన ఇప్పటికి తొమ్మిది ఎన్నికలను చూశారు. టీడీపీకి ముప్పై ఏళ్లుగా సారథ్యం వహిస్తున్నారు. అలా ఆయన ఎన్నికల రాజకీయాల్లో బాగా పండిపోయారు. ఆయన జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని టీడీపీ అనుకూల మీడియా ద్వారా చెప్పించారు. అయితే చంద్రబాబు ఆనాడు చెప్పించిందంతా వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు కేంద్రం సాయం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ సందరchandrababu{#}Janasena;March;Amith Shah;Pawan Kalyan;media;Bharatiya Janata Party;TDP;Elections;Hyderabad;Jagan;YCP;CBN;Partyచంద్రబాబు మౌనం.. టీడీపీ గుండెళ్లో రైళ్లు?చంద్రబాబు మౌనం.. టీడీపీ గుండెళ్లో రైళ్లు?chandrababu{#}Janasena;March;Amith Shah;Pawan Kalyan;media;Bharatiya Janata Party;TDP;Elections;Hyderabad;Jagan;YCP;CBN;PartySat, 17 Feb 2024 09:00:00 GMTటీడీపీ అధినేత చంద్రబాబుది నాలుగున్నర దశాబ్దాల అనుభవం. ఆయన ఇప్పటికి తొమ్మిది ఎన్నికలను చూశారు. టీడీపీకి ముప్పై ఏళ్లుగా సారథ్యం వహిస్తున్నారు. అలా ఆయన ఎన్నికల రాజకీయాల్లో బాగా పండిపోయారు. ఆయన జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని టీడీపీ అనుకూల మీడియా ద్వారా చెప్పించారు. అయితే చంద్రబాబు ఆనాడు చెప్పించిందంతా వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  


ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు కేంద్రం సాయం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా నుంచి పిలుపు రావడం.. వెంటనే దిల్లీ వెళ్లడం.. తిరిగి హైదరాబాద్ వచ్చి పవన్ కల్యాణ్ తో భేటీ అవడం చకచకా జరిగిపోయాయి. పొత్తులపై హడావుడి చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయింది. దీనిపై అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ సైతం మౌనం వహిస్తున్నారు.


ప్రస్తుతం జనసేనాని కూడా తన కదలికల్ని తగ్గించారు. అసలు ప్రతిపక్ష కూటమి పరిస్థితి ఏంటి. కూటమి కడతారా? ఎవరికి వారుగా పోటీ చేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటికే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి వైసీపీ వచ్చి చేరింది. అయితే దిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పొత్తుల్లో మందగమనం కనిపిస్తోంది. చంద్రబాబు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. అయితే చంద్రబాబుది వ్యూహామా? వ్యూహాత్మకమా అనేది అర్థం కావడం లేదు.


చంద్రబాబు బీజేపీని కాదని ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని ఆ పార్టీ పెట్టిన డిమాండ్లను ఒప్పుకునే స్థితిలో కూడా లేరు. మరోవైపు చంద్రబాబుని పవన్ కల్యాణ్ సైతం కలవడం లేదు. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలుండగా ప్రస్తుతం ఎవరికి వారు సైలెంట్ గా ఉండటం ఎవరికీ మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత గందరగోళ పరిస్థితులను చక్కదిద్దకంటే మాత్రం పొత్తుల లాభం కంటే నష్టమే ఎక్కువ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>