HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-healthf5b110b4-a190-4704-a6c2-b02d50b35f26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heart-healthf5b110b4-a190-4704-a6c2-b02d50b35f26-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గుండె పోటు సంభవిస్తున్న వారి మరణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి.ఈరోజుల్లో పాతికేళ్లు కూడా నిండని వారు గుండె సమస్యలతో మరణిస్తున్నారు. అయితే భారతీయుల్లో శారీరక శ్రమ లేకపోవడం వల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. నడక పూర్తిగా మానేయడం వల్లే ఇలాంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గుండె సమస్యలను ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే Heart Health{#}Manam;Heartఈ లక్షణాలుంటే గుండెపోటు పొంచి ఉన్నట్లే?ఈ లక్షణాలుంటే గుండెపోటు పొంచి ఉన్నట్లే?Heart Health{#}Manam;HeartFri, 16 Feb 2024 14:15:03 GMTఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గుండె పోటు సంభవిస్తున్న వారి మరణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి.ఈరోజుల్లో పాతికేళ్లు కూడా నిండని వారు గుండె సమస్యలతో మరణిస్తున్నారు. అయితే భారతీయుల్లో శారీరక శ్రమ లేకపోవడం వల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు  ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. నడక పూర్తిగా మానేయడం వల్లే ఇలాంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గుండె సమస్యలను ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలని గమనించి వెంటనే అలర్ట్‌ అయితే ప్రాణాలు నిలుపుకోవచ్చు. మరి ఆ లక్షణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.తక్కువ పనికే ఎక్కువ అలసటగా అనిపిస్తున్నా అది కూడా పనితీరులో వచ్చిన మార్పు లక్షణంగా భావించాలి. వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.


దీర్ఘకాలంగా గొంతు నొప్పి సమస్యతో బాధపడుతుంటే కూడా అది గుండె వైఫల్యానికి లక్షణంగా నిపుణులు చెబుతున్నారు.ఒకవేళ ఉన్న పలంగా శరీరం బరువు పెరిగితే వెంటనే అలర్ట్‌ అవ్వాలి. గుండె సంబధిత పరీక్షల చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఇక గుండె కొట్టుకోవడంలో వేగం పెరిగినా వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. గుండెపై భారం పడినప్పుడే ఇలాంటి సందర్భం వస్తుందని హెచ్చరిస్తున్నారు.గుండె పనితీరుపై ప్రభావం పడితే వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. రెండు రోజులకు మించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో శరీరంలో వాపు ఒకటి. ముఖ్యంగా చీలమండలు వంటి శరీరంలోని కొన్ని భాగాలలో వాపు మొదలవుతుంది. ఇది కాలక్రమేణా పెరిగుతూ ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ లక్షణాలు గుర్తించి జాగ్రత్తగా ఉండండి. గుండెపోటు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>