Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mega-157a01fe1ba-3248-4fe2-a8cc-b94a87645c56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mega-157a01fe1ba-3248-4fe2-a8cc-b94a87645c56-415x250-IndiaHerald.jpgవాల్తేరు వీరయ్య హిట్ అయినా భోళా శంకర్ ఇచ్చిన షాక్ వల్ల చిరంజీవి ఇక రీమేక్ ల జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాడు. మెగా ఫ్యాన్ బేస్ ఎంత ఉన్నా సరే సరైన సినిమాతో వస్తే ఎవరి సినిమా అయినా నిరాశ పరచక తప్పదని ప్రూవ్ అవుతుంది. ప్రస్తుతం చిరు మెగా 156 సినిమాగా యంగ్ డైరెక్టర్ వశిష్టతో చేస్తున్నారు. విశ్వంభర అంటూ వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వస్తుంది.Mega 157{#}choudary actor;vishwa;Remake;Chiranjeevi;Yuva;shankar;Trisha Krishnan;Population;producer;Producer;media;Director;Cinemaఆ బ్యానర్ లో మెగా 157..!ఆ బ్యానర్ లో మెగా 157..!Mega 157{#}choudary actor;vishwa;Remake;Chiranjeevi;Yuva;shankar;Trisha Krishnan;Population;producer;Producer;media;Director;CinemaFri, 16 Feb 2024 23:21:22 GMTవాల్తేరు వీరయ్య హిట్ అయినా భోళా శంకర్ ఇచ్చిన షాక్ వల్ల చిరంజీవి ఇక రీమేక్ ల జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాడు. మెగా ఫ్యాన్ బేస్ ఎంత ఉన్నా సరే సరైన సినిమాతో వస్తే ఎవరి సినిమా అయినా నిరాశ పరచక తప్పదని ప్రూవ్ అవుతుంది. ప్రస్తుతం చిరు మెగా 156 సినిమాగా యంగ్ డైరెక్టర్ వశిష్టతో చేస్తున్నారు. విశ్వంభర అంటూ వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వస్తుంది.

ఈ సినిమాలో చాలా కాలం తర్వాత త్రిష తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తుంది. సినిమా కోసం త్రిష 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. విశ్వంభర సినిమాలో త్రిషతో పాటు అనుష్క, మీనాక్షి చౌదరి కూడా ఉంటారని టాక్. విశ్వంభర సినిమా తర్వాత చిరంజీవి మెగ 157 గా పీపుల్ మీడియా బ్యానర్ లో సినిమా చేస్తారని తెలుస్తుంది.

ఈమధ్య చిరంజీవి పీపుల్ మీడియా బ్యానర్ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తో దిగిన ఫోటో చూస్తే ఈ కాంబో సినిమా దాదాపు పక్కా అని అంటున్నారు. ఇదే సినిమాకు మెగా డాటర్ సుస్మిత కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతుందని అంటున్నారు. మెగా 157 పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో దాదాపు ఫిక్స్ అయినట్టే అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. చిరుతో సినిమా అంటే స్క్రిప్ట్ నుంచి చాలా పకడ్బందీ ప్లానింగ్ ఉండాలి. మరి చిరు ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తారన్నది చూడాలి. వశిష్ట లానే యువ దర్శకుల్లో ఒకరు ఈ సినిమా డైరెక్షన్ ఛాన్స్ అందుకుంటారని తెలుస్తుంది. అయితే ఆ రేసులో ఎవరెవరు ఉన్నారన్నది మాత్రం బయటకు రాలేదు. మెగా 157 సినిమాపై అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>