PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-naidu-pawan-f6ad007f-315d-4931-b818-52b09d7eca3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi-naidu-pawan-f6ad007f-315d-4931-b818-52b09d7eca3d-415x250-IndiaHerald.jpgపోని పవన్ ఏమన్నా మాట్లాడారా అంటే అదీలేదు. పొత్తుల విషయమై పవన్ కూడా నోరిప్పటంలేదు. బీజేపీ నుండి పొత్తులపై అసలు సౌండే లేదు. చంద్రబాబూ జిల్లాల టూర్లు చేయటంలేదు, పవన్ కూడా అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఇక్కడే అందరిలోను అనేక సందేహాలు పెరిగిపోతున్నాయి. అమిత్ షా తో చర్చల్లో ఏమాత్రం అనుకూలంగా ఉన్నా చంద్రబాబు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవారే అనటంలో సందేహంలేదు. modi naidu pawan {#}Raccha;Amith Shah;central government;Janasena;Pawan Kalyan;Bharatiya Janata Party;Minister;Delhi;CBNఅమరావతి : చంద్రబాబు, పవన్ నోరెందుకు విప్పటంలేదు ?అమరావతి : చంద్రబాబు, పవన్ నోరెందుకు విప్పటంలేదు ?modi naidu pawan {#}Raccha;Amith Shah;central government;Janasena;Pawan Kalyan;Bharatiya Janata Party;Minister;Delhi;CBNFri, 16 Feb 2024 05:00:00 GMT

ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు పొత్తు చర్చలు జరిపి ఇప్పటికి వారంరోజులుపైగా అయిపోయింది. ఢిల్లీ నుండి తిరిగిరాగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చంద్రబాబు అన్నీ విషయాలను పంచుకున్నారు. అమిత్ షా తో భేటీలో ఏమి మాట్లాడింది, షా ఏమి చెప్పింది, పొత్తులో బీజేపీ ఎన్నిసీట్లు అడిగిందనే విషయాలన్నింటినీ వివరించుంటారు.





చంద్రబాబు తిరిగి వచ్చేసిన తర్వాత పవన్ ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా తో భేటీ అయి టీడీపీ, బీజేపీ పొత్తు, పోటీచేయబోయే సీట్ల విషయాలను కూడా ఫైనల్ చేసుకుని వస్తారని విపరీతంగా ప్రచారం జరిగింది. అందుకనే మూడుపార్టీల కూటమంటు నానా రచ్చ మొదలైపోయింది. అయితే ఏమి జరిగింది ? ఢిల్లీలో కాని తిరిగి వచ్చిన తర్వాత కాని చంద్రబాబు ఇంతవరకు నోరిప్పలేదు. అమిత్ షా తో చర్చల సారాంశాన్ని మీడియాకు చెప్పలేదు. జిల్లాల పర్యటన కూడా మొదలుపెట్టలేదు.





పోని పవన్ ఏమన్నా మాట్లాడారా అంటే అదీలేదు. పొత్తుల విషయమై పవన్ కూడా నోరిప్పటంలేదు. బీజేపీ నుండి పొత్తులపై అసలు సౌండే లేదు. చంద్రబాబూ జిల్లాల టూర్లు చేయటంలేదు, పవన్ కూడా అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ఇక్కడే అందరిలోను అనేక సందేహాలు పెరిగిపోతున్నాయి. అమిత్ షా తో చర్చల్లో ఏమాత్రం అనుకూలంగా ఉన్నా చంద్రబాబు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవారే అనటంలో సందేహంలేదు.





చంద్రబాబు వైఖరి ఎలాగుంటుందంటే తనకు మేలుజరిగినా, పై చేయి అయినా వెంటనే రెచ్చిపోతుంటారు. అదే ఊహిచనిది జరిగి ఇబ్బందుల్లో పడితే కొద్దిరోజులు అసలు మీడియాకు మొహం కూడా చూపించరు. నేతలతో కూడా సమావేశాల్లో పొడిపొడిగానే మాట్లాడి పంపించేస్తుంటారు. ఇపుడు చంద్రబాబు చేస్తున్నదిదే. పవన్ అయితే అసలు నోరే విప్పటంలేదు. దాంతోనే ఢిల్లీ భేటీలో చంద్రబాబుకు  గట్టి ఫిట్టింగ్ ఏదో పడినట్లే అందరికీ అనుమానం పెరిగిపోతోంది. ఆ ఫిట్టింగ్ లో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాకే నానా అవస్తలు పడుతు నోరు కూడా విప్పటంలేదని సమాచారం.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>