MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgసంక్రాంతి రేస్ కు విడుదలై సంచలనాలు క్రియేట్ చేసిన ‘హనుమాన్’ విడుదలై నెలరోజులు దాటిపోయినప్పటికీ ఈసినిమా సృష్టించిన సంచలనాల గురించి ఇంకా మీడియా వార్తలు రాస్తూనే ఉంది. ఈసినిమా ఘనవిజయం ఇచ్చిన జోష్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ 2’ వైపు అడుగులు వేస్తూ ఆ సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ఇంచుమించు పూర్తి చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈసీక్వెల్ లో హనుమంతుడి పాత్రలో ఒక సీనియర్ హీరో నటిస్తే బాగుంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆప్రయత్నాలు ముందుకు సాPRASANTH VARMA{#}Ram Gopal Varma;prasanth;prasanth varma;rana daggubati;Yash;vegetable market;Darsakudu;Prashant Kishor;Athadu;Anandam;Josh;Hero;Director;News;media;Indiaహనుమంతుడి అన్వేషణలో ప్రశాంత్ వర్మ !హనుమంతుడి అన్వేషణలో ప్రశాంత్ వర్మ !PRASANTH VARMA{#}Ram Gopal Varma;prasanth;prasanth varma;rana daggubati;Yash;vegetable market;Darsakudu;Prashant Kishor;Athadu;Anandam;Josh;Hero;Director;News;media;IndiaFri, 16 Feb 2024 15:00:00 GMTసంక్రాంతి రేస్ కు విడుదలై సంచలనాలు క్రియేట్ చేసిన ‘హనుమాన్’ విడుదలై నెలరోజులు దాటిపోయినప్పటికీ ఈసినిమా సృష్టించిన సంచలనాల గురించి ఇంకా మీడియా వార్తలు రాస్తూనే ఉంది. ఈసినిమా ఘనవిజయం ఇచ్చిన జోష్ తో దర్శకుడు ప్రశాంత్  వర్మ హనుమాన్ 2’ వైపు అడుగులు వేస్తూ ఆ సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ఇంచుమించు పూర్తి చేసినట్లు సమాచారం.



భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈసీక్వెల్ లో హనుమంతుడి పాత్రలో ఒక సీనియర్ హీరో నటిస్తే బాగుంటుందని దర్శకుడు ప్రశాంత్  వర్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆప్రయత్నాలు ముందుకు సాగడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సీక్వెల్ లో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవిని అడిగినప్పటికీ అతడు సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.



ఆతరువాత ఈపాత్ర కోసం రానా తో సంప్రదింపులు జరిపినప్పటికీ ఆవిషయంలో కూడ క్లారిటీ లేదు అంటున్నారు. దీనితో ప్రశాంత్  వర్మ ‘కేజీ ఎఫ్’ ఫేమ్ యష్ తో హనుమంతుడి పాత్ర విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే యష్ నితీష్ తివారీ తీయబోతున్న రామాయణంలో రావణు డి పాత్ర వేయబోతున్న నేపధ్యంలో ఆమూవీ మూడు భాగాలుగా నిర్మాణం జరుపుకునే పరిస్థితులలో యష్ డేట్స్ లభించడం కష్టం అని అంటున్నారు.



పాన్ ఇండియా స్థాయిలో తీయబోతున్న ఈమూవీకి భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్న పరిస్థితులలో ఈమూవీ మార్కెట్ అవ్వాలీ అంటే ఒక టాప్ హీరో ఈమూవీలో హనుమంతుడి పాత్ర ఒక హీరో వేసి తీరాలి. ఇప్పుడు అలాంటి హీరో ఎవరు అన్నది ప్రశాంత్ వర్మ అన్వేషణ. దీనితో ‘హనుమాన్’ సూపర్ సక్సస్ అయిన ఆనందం కంటే ఈసినిమా సీక్వెల్ కు సరైన హీరో దొరకలేదు అన్న టెన్షన్ తో దర్శకుడు ప్రశాంత్  వర్మ  తన అన్వేషణను జాతీయ స్థాయిలో కొనసాగిస్తున్నాడు అంటూ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తూ ఉండటం ఒక షాకింగ్ న్యూస్..      






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>