PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pulivendula-ys-sharmila-jagan-chandrababu1843d51b-4db7-43c7-a249-53f18c6db500-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pulivendula-ys-sharmila-jagan-chandrababu1843d51b-4db7-43c7-a249-53f18c6db500-415x250-IndiaHerald.jpgఅందుకనే కేసును పులివెందులకు బదిలీచేసి విచారించమన్నారు. ఎప్పుడైతే పులివెందుల పోలీసులు రంగంలోకి దిగారు వెంటనే నిజాలు బయటపడ్డాయి. వర్రా పేరుతో పోస్టయిన ఐపీ అడ్రస్ ల ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దాంతో విచారణ వైజాగ్ కు దారితీసింది. ఐటి అడ్రస్ ప్రకారం పోస్టులు ఎక్కడనుండి పెడుతున్నారని కూపీలాగితే ఒక అడ్రస్ దొరికింది. ఆ అడ్రస్ మీద దాడిచేసిన పోలీసులకు విషయం అర్ధమైపోయింది.pulivendula ys sharmila jagan chandrababu{#}uday kiran;Vishakapatnam;Y S Vivekananda Reddy;Pulivendula;Reddy;Jagan;TDP;Sharmila;YCP;media;Hyderabad;policeఅమరావతి : టీడీపీయే షర్మిలను గబ్బుపట్టిస్తోందా ?అమరావతి : టీడీపీయే షర్మిలను గబ్బుపట్టిస్తోందా ?pulivendula ys sharmila jagan chandrababu{#}uday kiran;Vishakapatnam;Y S Vivekananda Reddy;Pulivendula;Reddy;Jagan;TDP;Sharmila;YCP;media;Hyderabad;policeFri, 16 Feb 2024 03:00:00 GMTతాజాగా పోలీసులు చెప్పిన వివరాలను బట్టి నిజమనే అనిపిస్తోంది. పేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు కనబడుతున్నాయట. షర్మిలపైన మాత్రమే కాకుండా విజయమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతపైన కూడా రాయటానికి కూడా వీలేన్నంత అసభ్యంగా పోస్టులున్నాయట. దీనిపైన షర్మిల ఏమన్నారంటే తన అన్న జగన్మోహన్ రెడ్డి ప్రోదల్బంతోనే ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్నారని.  





పులివెందులకు చెందిన జగన్ వీరాభిమాని వర్రా రవీంద్రారెడ్డే  అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు సునీత హైదరాబాద్ లో పోలీసు ఫిర్యాదు కూడా చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి రవీంద్రారెడ్డిని విచారించారు. వర్రాయేమో తాను ఎవరిమీద ఎలాంటి పోస్టులు పెట్టలేదని మొత్తుకున్నాడు. తాను వైఎస్ ఫ్యామిలీకి అభిమాని అయినపుడు ఇక వాళ్ళపైన అసభ్యకరమైన పోస్టులు ఎందుకు పెడతానని ఎదురుతిరిగాడు. దాంతో పోలీసులకు ఈ కేసు పెద్ద చాలెంజ్ గా మారింది.





అందుకనే కేసును పులివెందులకు బదిలీచేసి విచారించమన్నారు. ఎప్పుడైతే పులివెందుల పోలీసులు రంగంలోకి దిగారు వెంటనే నిజాలు బయటపడ్డాయి. వర్రా పేరుతో పోస్టయిన ఐపీ అడ్రస్ ల ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దాంతో విచారణ వైజాగ్ కు దారితీసింది. ఐటి అడ్రస్ ప్రకారం పోస్టులు ఎక్కడనుండి పెడుతున్నారని కూపీలాగితే ఒక అడ్రస్ దొరికింది. ఆ అడ్రస్ మీద దాడిచేసిన పోలీసులకు విషయం అర్ధమైపోయింది.





ఇంతకీ విషయం ఏమిటంటే ఆ అడ్రస్ లో నుండి పోస్టులు  పెడుతున్నది టీడీపీ సీనియర్ కార్యకర్త ఉదయ్ భూషణ్, ఆయన కొడుకు. వర్రా పేరుతో 15 ఫేక ఐడీలు సృష్టించి షర్మిల, విజయమ్మ, సునీతకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టులు పెడుతున్నది భూషణే అని తేలింది. పోలీసుల విచారణలో భూషణ్ కూడా అంగీకరించారు. తమపై అసభ్యకరమైన పోస్టులు వస్తున్నందుకు జగన్ పైన నానా బురదచల్లేసిన షర్మిల ఇపుడు ఏమంటారు ? షర్మిల ఇమేజిని చంద్రబాబు, లోకేషే గబ్బుపట్టించినట్లు అర్ధమైపోయింది. ఎందుకంటే భూషణ్ ఐ టీడీపీలో చాలా యాక్టివ్ సభ్యుడు. ఐ టీడీపీ అంటేనే టీడీపీ సోషల్ మీడియా వింగని అందరికీ తెలుసు. మరి వీళ్ళకు తెలీకుండానే షర్మిల మీద భూషణ్ పోస్టులు పెట్టగలడా ?





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>