Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-e98165e5-adbb-441f-ac87-165c5d17aba5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-e98165e5-adbb-441f-ac87-165c5d17aba5-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రేమ పేరుతో ఎన్నో రోజులపాటు చటాపట్టాలు వేసుకొని తిరుగుతున్న జంటలు.. ఇక ప్రేమను గెలిపించుకోలేము అని తెలిసి చివరికి మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల ప్రేమికుల రోజు నాడే ఓ దారుణ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొన్నూరు మండలం పరిధిలో జరిగిన ఈ ఘటన అందర్నీ షాక్ కి గురిచేSuicide {#}sunita singer;Ponnur;vamsi;Premikula Roju;Smart phone;Athadu;prema;Love;policeవాలెంటెన్స్ డే రోజే చనిపోవాలి అనుకున్నారు.. కానీ ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు?వాలెంటెన్స్ డే రోజే చనిపోవాలి అనుకున్నారు.. కానీ ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు?Suicide {#}sunita singer;Ponnur;vamsi;Premikula Roju;Smart phone;Athadu;prema;Love;policeFri, 16 Feb 2024 09:15:00 GMTఇటీవల కాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రేమ పేరుతో ఎన్నో రోజులపాటు చటాపట్టాలు వేసుకొని తిరుగుతున్న జంటలు.. ఇక ప్రేమను గెలిపించుకోలేము అని తెలిసి చివరికి మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల ప్రేమికుల రోజు నాడే ఓ దారుణ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొన్నూరు మండలం పరిధిలో జరిగిన ఈ ఘటన అందర్నీ షాక్ కి గురిచేస్తుంది అని చెప్పాలి.


 సహజీవనం చేస్తున్న యువతి యువకులు ఇద్దరు కూడా ప్రేమను గెలిపించుకోలేకపోతున్నామని.. ఎంతగానో బాధపడిపోయారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆత్మహత్య చేసుకునే విషయంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మాన్నవ గ్రామంలో వంశీ అనే భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న యువకుడు.. తన సమీప బంధు అయిన వివాహిత సునీతను ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెతో క్రమంగా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారిపోయింది. అయితే సునీత తనను ప్రేమిస్తున్న వంశీతో కలిసి ఉండాలని నిర్ణయించుకుని సహజీవనం చేయడం కూడా మొదలుపెట్టింది. కానీ పెద్దలకి వీరి బంధం నచ్చలేదు. దీంతో హెచ్చరించారు. దూరంగా ఉండాలని కాస్త గట్టిగానే చెప్పారు.


 అయితే ఇటీవల వాలంటైన్స్ డే రోజు వంశీ సునీతకు ఫోన్ చేసి మన ప్రేమకు పెద్దలు అడ్డంకిగా మారారు.. కలిసి జీవించే అవకాశం లేదు. కనుక కనీసం కలిసి చనిపోదాం అంటూ ప్రపోజ్ చేశాడు. సునీతను వెంటనే రమ్మని ఓ ప్రాంతానికి పిలిచాడు. అప్పటికే విషం డబ్బా తెచ్చాడు వంశీ. అయితే అతడు ఆమెకి ఆ పాయిజన్ డబ్బా ఇవ్వడంతో వెంటనే ఆమె తాగేసింది. కానీ వంశీ మాత్రం తనకు భయంగా ఉందంటూ డబ్బా అక్కడే పడేసి పారిపోయాడు. దీంతో సునిత షాక్ అయింది. అప్పటికే పురుగుల మందు తాగడంతో నురగలు కక్కుతూ పడిపోవడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పథకం ప్రకారం సునీత అడ్డు తొలగించుకునేందుకు వంశీ ఇలా చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>